పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

దరహంమీద, తెలుగు పదాలు కలదిగా వుంటుంది. తక్కిన రెండువంతులూ తత్సమ పదాలుగా వుంటాయి. కాని, ప్రసాదగుణ భూయిష్టంగా వుండే ధార కావడంచేత కదళీపాకంగా అందరికీ అందుబాటులో వుంటుంది.

ధారాళమైన ధారతో చదువరులకు చదివినకొద్దీ చదవాలనే కోర్కిని గలిగించే శైలిలో వున్నప్పటికీ అఈ కథ భారత-రామాయణాల మాదిరిగా సర్వే సర్వత్ర తెలిసింది కాకపోబట్టి వాట్లమాదిరిని ఈ కవిత్వం వ్యాప్తికి రాకపోయింది గాని, ఆలాగే కాకపోతే, ఈ రాణాప్రతాపచరిత్ర రామాయణం లాగ వ్యాపించ తగ్గది. ఈప్రతాపుడు రాముడికంటే ఏ సుగుణంలోనూ తీసి పోడు. ఈ రాజ శేఖరకవి కవిత్వం రామాయణగాధ తెలుగులో రచించిన కవుల కవిత్వానికిన్నీ తీసిపోదు.

మ॥ అమరోద్యానమువోలే నెల్లేడ సమగ్రానందమున్ బెంచి లో
    కముఁ గల్యాణపు మండపంబటు వెలుంగన్ జేయు స్వాతంత్య్ర ధ
    ర్మ మహాదేవత మున్గె గిల్బిష సముద్రంబందున రక్త హ
    స్తములన్ లేపిన లేచు లేవదణు మాత్రన్ రిక్త హస్తంబులన్.

నాలుగో చరణంలోవున్న “రక్త హస్త-రిక్త హస్త " శబ్ద కూడిక మిక్కిలీ హృదయంగమం. యుద్ధభాగంలో ఈకవి కవిత్వం తిక్కన సోమ యాజని జ్ఞప్తికి తెస్తూ వుంటుంది.

ఉ॥ అత్తరి విక్రమించి భయదాహవశౌర్యుడు శ్వామసింహ భు
    భృత్తిలకుండు శీర్షకము భేదిల మోదును ఖాను ఖడ్గ ము
    ద్వృత్తి వియత్త లంబులకుఁ ద్రెవ్వఁగఁగొట్టి హయంబుఁ గూల్ప నో
    రెత్తక వాఁడు మౌనము వహించుచుఁ బాఱెను నేల దూఁకుచున్.

ఈలాటి పద్యాలు వరుస వెంబడిని వుదాహరించ వలసిన పున్నాయి. కవి అధునాతనుడే అయినా కవిత్వం అధునాతనంగా వుండదు.

అయీ పుస్తకం వీరరస ప్రధానం. రాజపుత్రులకూ మహమ్మదీయులకూ, సంబంధించిన యుద్ధపద్ధతిని తేల్పేది. కవి మనఆంధ్రుడు. రాయలసీమ వాడు. ఇంటిపేరు దుర్భాకవారు. దుబ్బాక వెంకటాచల శాస్త్రుల్లు గారిని