పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పతిన్నీ బావమఱదీన్నీ అయిన మానసింహ రాజన్యున కిచ్చే జవాబులోనివి మానసింహుని తండ్రీ భగవాన్దాసు తాత్కాలిక సుఖంకోసం తన కూతుర్ని (దిగ్ధిగ్ధిక్) అగ్బరు చక్రవర్తి కిచ్చి పెండ్లిచేసి కులగౌరవాన్ని కాపాడు కొంటూ వనవాసం అనుభవిస్తూ వున్న ప్రతాపసింహుణ్ణి కూడా తమతోపాటు చక్రవర్తికి లోబడవలసిందని రాయబారాన్ని తెచ్చిన సందర్భంలోనివి. ప్రతాపుని అభిప్రాయాన్ని వ్యాఖ్యానించే చిన్న పద్యంకూడా వొకటి వుటంకిస్తాను.....

ఈ రెండు చిన్న పద్యాలిస్తే యేం తేలుతుంది ఆయా పద్యాలున్న ద్వితీయాశ్వాసం 330 పద్యాలుస్నూ వుదాహరిస్తే బాగా తృప్తి కలుగుతుంది. ప్రతాపరుద్రుడికి ప్రతాపసింహుడు దీటు మాత్రమే కాదు. హెచ్చు. కవి ఆకవికి లోచ్చైనను, తన్మయత్వంలో హెచ్చు. లోగడమాటలు ప్రతాస రాణావారి మంత్రివి. ఈమంత్రిని సర్వవిధాలా భీష్ముడే అని చెప్పడంలో అతిశయోక్తి కన పడదు. ఆ గ్రంధంలోవున్న పాత్రలన్నీ యే కళంకము లేనివిగా కవి చిత్రించి వున్నాడు. రాణాప్రతాపుణ్ణిన్నీ రాముణ్ణిన్నీ త్రాసులోపెట్టి తూస్తే ప్రతాపుదే అసిధారావ్రతంలో చాలా మొగ్గుతాడు. కుశలవులు రాముణ్ణి యెత్తి పొడిచారు. ప్రతాపుణ్ణి అయితే యెత్తి పొడవలేరనే తోస్తుంది. తగిన పదార్థానికి తగిన పాచకుడు లభిస్తే రుచి కలిగినట్లు ఈ రాజశేఖరకవివల్ల ప్రతాపుడి ప్రతాపం శోభించింది. యెక్కడ యెంతవఱకు వ్రాయడం అవసరమో అక్కడ అంత వఱకే వ్రాసి చదువరులకు విసుగులేని పద్ధతిని గ్రంధరచన సాగించడము సుబసుఖాలు పట్టు పడేదికాదు. ఆపద్ధతి ఈ రాజశేఖర కవికి లభించింది. ఈ గ్రంధంలో వచనాలు లేవు అన్నీ ఛందోమయాలే. సుప్రసిద్ధమైన పద్యాలే. సుమారు యేడెనిమిది రకాలు వాడబడ్డాయి. వుదాహరించవలసివస్తే చాలా స్థలం ఆక్రమిస్తుంది సీసపద్యం........

రాజశేఖర కవిగారి రచనలో, యెంతసేపు పరిశీలించినా పొల్లుమాటలు కనబడవు. కవిత్వం, మూడు వంతులతో వొకవంతు మాత్రమే