పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

రాణా ప్రతాపసింహ చరిత్ర

రా జ శేఖ ర క వి ప్రణితము.

కవిత్వము ♦ తన్మయత్వము

శ్రీ శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారి

విపులసమీక్ష.

ప్రస్తుత గ్రంథాన్ని ఆంగ్ల భాషా నిష్ణాతులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు మిక్కిలి మెచ్చుకొన్నారంటే నాబోట్ల లెక్కేమిటి, యీయన పేరు రాజశేఖరుడు. యీ పేరు పరమేశ్వరునిదే కానీ, ప్రస్తుత గ్రంథ రచనా సందర్భంలోవున్న కొన్ని ఘట్టాలను బట్టి చూస్తే ప్రతాపసింహునికి పర్యాయ మేమో అని ప్రతి సహృదయునికీ గోచరిస్తుందని నానిశ్చయం. కవులలో తన్మయత్వం కలవారు కొందఱేే వుంటారు. ఆధునికులలో యీ రాజశేఖరకవి తన్మయత్వంకల కవి అని రచన వ్యాఖ్యానిస్తూవుంది వుదాహరించ వలసి వస్తే గ్రంధంలో నూటికి 50 పద్యాలైనా పుదాహరించవలసి వస్తుంది. కనుక కొంచెం మాత్రమే పుదాహరిస్తాను.

మ॥ రవి యస్తాద్రిని మొల్చుగా కఖిల పారావారముల్ కృంగుఁగా
    కవనీ చక్రము వ్రీలుగాక చెడుగా కాకాశ మయ్యుగ్ర భై
    రవుఁడై లోకముఁ గాల్చుఁగాని లవమున్ రాణా ప్రతాపుండు గౌ
    రవమున్ గోల్పడి మర్త్యమాత్రునకు శీర్షం బొగ్గ డెప్పట్టునన్

యీ మాటలు ప్రతాపుని మంత్రిన్నీ కులవృద్ధున్నూ పరమ పూజ్యుడున్నూ అయిన “సలుంబ్రా-కృష్ణసింహుడు" అగ్బరు చక్రవర్తికి సర్వసేనాధి