పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

మేము అడియారు ఆనేబిసెంటు సభకు వెళ్ళినప్పుడు యిప్పటికి యేభై యేళ్ళ క్రిందట సందర్శించి వున్నాం. బహుశః ఆదుబ్బాకవారున్నూ యీదుబ్బాక వారున్నూ వొకరే యేమో. భవతు. మొత్తం కవి మహమ్మదీయులకు అను కూలించేవాడు మాత్రం కాదు, అయితే మాత్రం, రెండూ రెండుకళ్లుగానే చూచుకొని రచన సాగించాడు గాని, పక్షపాతంగా కలం నడపలేదు. అగ్బరు గుణాతిశయాన్ని శత్రువులచేత గూడ చక్కగా అనువదింప చేశాడు. సందేహం లేదు. కాని, యుద్ధవర్ణనలో మాత్రం రాజపుత్రుల యందు నలుసంత పక్షపాతంగా కలం (ఆవశంగానే - అనుకుందాం) నడిచిందేమో. అని నాకు అనుమానం......బాహుబలాఢ్యులున్నూ, పౌరుష ప్రధానులున్నూ అయిన రాజపుత్ర వీరులు - లక్షలుకొలది మహమ్మదీయులతో వేలకొలదిగా మాత్రమే వున్న తాము సుమారు 25 యేండ్లు నిలిచి పోరాడి నిర్వహించ గలిగారన్నది పరమార్ధం. రాజపుత్రులది తమదేశంలో మట్టుకు తమ స్వాతంత్యం నిల్పు కొనే ప్రయత్నమే కాని అగ్బరు చక్రవర్తి ప్రభుత్వాన్ని యీ దేశాన్నుంచి ఆసీమాంతం చెరుపుదామనే ప్రయత్నంకాదు. చక్రవర్తికో? తన గొడుగు తప్ప యింకోగొడు గెక్కడా వుండనేకూడదనే గౌరవాకాంక్ష. అవును. అతడు సార్వభౌముడు కదా పాపం ఆ బిరుదం అర్ధవంతం కావాలంటే యింకో శూరుడు తనకు మొక్కనివాడు వుండడంవల్ల కాదు. యీదోషం మహానుభావుడైన అగ్బరుది కాదు. అది అతడు ధరించిన సార్వభౌమ బిరుదాని దనుకో వాలి. ఆయీ బిరుదే చాలా ఘోరాలు చేయించింది అగ్బరుచేత. గ్రంధకర్త ప్రతాపుణ్ణెంత చక్కగా కాపాడి దిద్ది తీర్చాడో అగ్బరు చక్రవర్తి నికూడా అంత శ్రద్ధాభక్తులతో దీద్ది తీర్చి ధీరోదాత్త నాయకాగ్రేసరుణ్ణిగా ప్రకటించాడు. వాల్మీక్యాదులు రావణాదులను యింత చక్కగా చిత్రించనే లేదన్నా తప్పు లేదనుకుంటాను.

ప్రతాపుని గుణగనిణాతికి లొంగిపోయిన అబ్దూరహిమాను మొదలైన పాదుషా మంత్రుల న్యాయైకదృష్టిని యీ కవి బహు చక్కగా ప్రక టించాడు.