Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    మెలమెల్లఁ జీఁకటుల్ మొలుచు వేళకువైనఁ
              గనుమ నెట్టులొ దాఁటి చనెదమేని
              
గీ॥ యర్ధరాత్రము కుంభల్' మియరును జేరఁ
   గలము, జయమొందఁగల మటుగాక రిపులు
   మనకు ముందుగఁ గనుమదూరిననుఁ బిదప
   నంగుళంబై న ముందున కరుగు టరిది. 9
   
సీ॥ ఈగిరులెల్ల రాణాగారికి సమీప;
              మెపుడెందు దూఁకునో యెఱుఁగరాదు;
    మనగాలి సుంతసోఁకినను సింహంబుల
              వంటి శిశోదియాభటులు గొలువ
    నీనినపులి యట్టు లెగిరి పైవ్రాలు; నా
              తని నోర్వనుదుట నేత్రమ్ము గలుగు
    నా గజాసురవైరికైన దుర్భర; మెంత
              యప్రమత్తుల మైననంత మేలు;
              
గీ॥ కాన వాద్యంబులెల్లను గట్టిపెట్టి
    పెదవి గదలింపకయె మౌనవిధివహించి
    వడివడిగదూఱి కనుమ వెంబడినిసాఁగి
    యవలఁ జేరంగవలయు నేర్పతిశయిల్ల.10
    
మ॥ అనుచు నల్వురు నల్వురై నిలువసైన్యంబంతయు దీర్చి యీ
    పని సంద్రంబున కేతమెత్తు టనుచున్ భావించియున్ మానసిం
    హనృపాలుండు ప్రతాపుని గెలుచు నత్యాశాబలా కృష్ణుఁడై
    "చనుఁడంచాజ్ఞ నొసంగె ముందునకుఁ దత్సైన్యాధిపుల్ భీతిలన్ 11 11

—♦ సలుంబ్రా కృష్ణసింహుఁడు హఠాత్తుగాఁ గనుమ నాక్రమించుట ♦—
. -
సీ॥ కడ గాసరాని దీర శరీరమున మహో
             రగము నికుంజ గర్భంబువెడలి
    వంకరగాసాఁగి పైకిఁ బ్రాకెడురీతి
             యవన సేనాదండ మల్లనల్లఁ