Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృ తీ యా శ్వా స ము

165

గీ॥ బొదలతో గండశిలలతో నదులతోడఁ
   గంటకమ్ములతోడ వృక్షములతోడఁ
   నీఁగకైనను జొరఁగ సందీయనట్టి
   భీకరారణ్యశైల దుర్భేద తలము. 6
   
సీ॥ కుండలీంద్రుఁడు చుట్టుకొని పండెనోయన
                వలగొనియున్న పర్వతపుఁబంక్తి
    నిలువుగా నఱకినట్టులు ప్రాఁక గారాక
                చక్కఁగా నిలుచు పాషాణసమితి
    ప్రకృతి నైసర్గిక భంగిఁ ద్రోపుగ నిడ్డ
                కొండ పేటులమీఁది కోటగములు
    మలిచి కొలిచియుంచు మాదిరియై యేట
                వాలగు పర్వత పార్శ్వములును
                
గీ॥ శకటములు రెండు సుళువుగాఁ జనుటకైన
   నను వొసఁగనట్టి యొక చిన్న కనుమగలిగి
   యల సురాసురులకుఁ జొర నలవిగాని
   కఠినతలము 'హాల్దీ ఘాటు' కనుమసీమ 7
   
ఉ॥ ముందుగమ్రోఁగు దుందుభులు మ్రోతలునిల్పుచు సైన్యకోటి నం
    దందును నిల్వఁజేయుచు రయంబునఁ దానొకచోటఁజేరి య
    య్యందఱ వాహినీపతుల నచ్చటఁజేరిచి మంతనంబు చె
    ల్వందగ మానసింహవిభుఁ డాదర మేదుర చిత్త మేర్పడన్. 8 8
    
మానసింహుఁ డనుచరులను హాల్దీఘాటుకనుమఁ జొరనియోగించుట.
-
సీ॥ ఇఁక దుర్గమము మార్గ; మీ మీదటి ప్రయాణ
              మతి కష్టతరము; భయాస్పదంబు
    గంటకుఁ దక్కువగాఁ బ్రొద్దునిలిచెఁ "గుం
              భల్ మియ' రిటకు నిర్వదియుమైళ్లు
    గలదు! హాల్దీఘాటు కనుమ కట్టెదురఁ గ
             న్పడి మృత్యు ముఖమట్లు భయముఁ గొలిపె