తృ తీ యా శ్వా స ము
167
గదరి హాల్డీమాటు కనుమ డాయుచునందు
మొదటి నల్వురుకాలు మోపునంతఁ,
బిడుగుల చప్పుడెల్లెడరేఁగ మూఁడువే
లాశ్వికోత్తములు తన్ననుసరింపఁ
గీ॥ దటము లెకతట్టుకొని మహోద్ధతిని దూఁకు
పరమ గంభీర గంగా ప్రవాహ ధాటి
నాకనుమఁదూఱి యాద్యంత మలమినిలిచె
సింహమటు సలుంబ్రాకృష్ణ సింహవిభుఁడు 12
చ॥ అనుపమ వాయువేగమున నద్రి ప్రతిధ్వనులీన నుద్ధతిన్
గనుమమొగంబు చొచ్చుకొని కట్టెదురన్ లయకాల రుద్రుఁడో
యనఁ బయిదూకు కృష్ణవిభు నా మొగలుల్ గని భీతిఁగ్రుంగుచున్
వెనుకకు మ్రొగ్గి రగ్గరుఁడునిన్ గని తగ్గు నహివ్రజంబనన్. 13
—♦ యవనసైన్యంబులు రాత్రికి దండు విడియుట. ♦—
మ॥ సమయం బెంతయుఁ బ్రాతికకూల్యము వహించగా గట్టునన్ జిక్కి తా
లిమిలో రోఁజెడు నాదిశేషువలె నిల్చెన్ మానసింహుండు వై
రము సాధించెదనందు; నంతఁ జతురశ్ర వ్యూహము బన్ని ప
శ్చిమ దిఙ్న్యస్త ముఖంబుతోడ వసియించెన్ బాదుషా సైన్యముల్ 14
మ॥ బలుసింగంపుఁ గడానికేతనము శోభల్ సల్డెసల్ నిండు క్రొం
జిలుఁగున్ బట్టు జిరాగుడారమున చిల్చెన్ దా జహంగీరు; ముం
గలి ప్రక్కన్ నును పంచవన్నియ పతాకల్గుల్కు క్రొమ్మించు చ
ల్వల డేరాకడ మానసింహుఁడు వసింపఁన్ బోయె నారాత్రికిన్.15
క॥ ఇరువుర గుడారముల నలు
తెఱఁగుల యువరాజు నింటి తెరవలు గణికల్
మఱి కపులు గాయకులు విడి
సిరి తత్తద్దత్త రుచిరతర శిబిరము లందున్. 16
క॥ నలుదెసల నీగుడారం
బుల చుట్టును మానసింహ భూవరు నంబర్