156
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
భుజమిచ్చి లేపక మొగలు రాజులఁ జేరి
సేవించుచుంటకై సిగ్గుపడక
తగుదుననుచు వచ్చి ధర్మదేవత వంటి
యిమ్మహాప్రభు సముఖమ్మునందుఁ
గీ॥ బిరికిమందు పోయఁగనిట్లు పెనఁగుచుంటి
వౌర! యిన్నాళ్ళు బ్రదికి నీనీరసోక్తు
లాలకింపఁగ నయ్యెఁగా యనుచుఁ జింత
హెచ్చె నేమందు నీభాగ్య మిట్టులుండె.300
సీ॥ నవ నిబంధనముల నవలనుంచుదు వంట;
చీఁకటిలో సంధి చేతువంట
యక్బరుచేవినేమొ యాడఁగావలెనంట;
యెవరిని బ్రతికింప నిన్నిపాట్లు
టాటోటువిద్యలు బూటకం బీమహా
విభుఁడొప్పు ననియె భావించినావె!
మాయ యెఱుంగని మహానీయులకు రహ
స్యములతో నెపుడైన నవసరంబె!
గీ॥ కనులు కర్ణంబు లొకవేయుగలిగి జగము
నిండియుండెడు దేవుండు నిజమెఱుఁగఁడె
ధర్మతత్వైకమూర్తి ప్రతాపుఁడేడ
జగములన్నియు రోయు నీసంధియేడ!301
గీ॥ యవనుల పదంబుఁ గొలిచి వియ్యంబువలచి
కుశమహారాజు కులకీర్తి గుంటఁ గలిపి
చెడుప వచ్చితె మమ్ముఁ దాఁ జెడ్డకోతి
వనమునంతయుఁ జెఱచునన్ భంగిదోఁప 302
క॥ ఉరగమును వృశ్చికమ్మును
గరళ క్రూరములు; పాముకన్నను మేలం
దురు తేలు: నిన్నుఁ గన న
క్బరు మేలనవచ్చు స్వకుల వర్ధనుఁ డౌటన్.303