ద్వి తీ యా శ్వా స ము
155
చిన్నదై కానుపించినను దుర్భేదమౌ
దేశ నైసర్గిక స్థితులఁబట్టి
గీ॥ యెంతమేరయు గెలిచిన నంతెకాని
యంగుళంబైన ముందున కరుగుటరిగి
శత శతాబ్దముల్ యుద్ధముల్ జరిపియైన
నక్బరఖిలంబుఁ గొనుట సాధ్యంబెకాదు. 295
మ॥ నను నారాజ్యము దూరముంచి తన సన్నాహంబు లేచ్చోటనై
నను సాగించిన నాకునేమనుచు మౌనంబూనఁగా వచ్చు నా
ఘనుఁడున్ నాదెసఁ జిన్ని వ్రేలొకఁడు నిక్కన్ బెట్టినన్ మాటలన్
బనియేమున్నది: దేశమున్ ప్రళయమొందన్ జేతు నిక్కంబుగన్ 296
క॥ విమతుల ఖడ్గము హృదయా
బ్జముఁ జొచ్చునుగాక ! యచటి స్వాతంత్య్ర బీ
జముఁ జంపుట మాత్ర మసా
ధ్యము; నెఱవేఱదు జగంబు తలక్రిందైనన్. 297
మ॥ పుడిసెం డూపిరి మేన నున్నవఱకున్ బోరాడి యాత్రోవనే
నడతున్; గాదని యాకసం బురలుచున్ నాశక్తికిన్ మీఱు న
ప్పుడు ఢిల్లీపురిఁజేరి యక్బరు సదాభూమిన్ బ్రవేశించి కే
ల్ముడుతున్ బొఁమ్మిక; నంతదాఁకను వినన్ బోనేరి సందేశమున్.”298
గీ॥ అనుచు గంభీరముద్ర యాస్యమునఁ దొలక
రింపఁగా నుండె నంతలోఁ గృష్ణసింహుఁ
డాత్మభావ మించుక తెలియంగఁ జేయ
మానసింహుని వదన పద్మమును గాంచి. 299 299
సలుంబ్రా కృష్ణసింహుఁడు మానసింహు నధిక్షేపించుట.
సీ॥ “సాటిరాజుల భుజా శౌర్యవంతుఁడవు; ధై
ర్యబలంబు సాహసం బలరు ప్రోఁడ
వఖిలదేశమ్ము దాస్యాంధ కారమ్మునఁ
బడి దుర్గతుల ముని చెడెడు వేళ