ద్వి తీ యా శ్వా స ము
157
శా॥ పావిత్య్రంబున కాటపట్టు పరిశుభ్రంబైన సత్కీర్తికిన్
దా! వాసత్యము నూఁతకోలయగు నీధర్మాత్ముతో నూఱులున్
వేవే లక్బరులై నఁ దూఁగుదు రొకో నీకేటికీ వెఱ్ఱి కా
శీ విశ్వేశ్వరుఁ డొక్కఁడే సవతుగాఁ జెప్పంగఁ బోలున్ జుమీ.304
మ॥ లవమున్ నీదిగు బోధ మొప్పఁడన నేలా యేకలింగేశుఁ'డి
య్యవనీచక్ర సమగ్ర రాజ్యమును నీకర్పింతు నన్గూర్చి య
య్యవనాధీశ్వరు మైత్రిచేయు'మనఁగా నౌనంచన్ బోఁడు; మా
నవుఁడీ ధైర్వసురాద్రి పట్టుదల మాన్పగా నేర్చునే యెవ్వఁడున్. 305
మ॥ సకల స్థావర జంగమాత్మక మహీచక్రంబునన్ సత్యధ
ర్మకళల్ నించు ప్రతాపసింహ విభుఁడీ రాజర్షి కాలుంచు పా
దుకలున్ మోయఁగ యోగ్యతల్ మనకు నెందున్ గల్గునే యట్టి వా
నికి ధర్మంబులు నేర్పఁజూలుదు మొకో నీవున్ మఱిన్ నేనునున్.306
చ॥ కరఁగిన లక్క పైన నదుర్కన్ గల ముద్రిక వోలె మాకు నం
దఱకు మనోంబుజంబులఁ బ్రతాపుఁడు తాండవమాడు; నీతఁ డొ
క్కరుఁడని యెంచెనేమొకొ మొగల్పతి; యిర్వదిరెండువేల యు
ద్ధురబలులుందు మించుకయుఁ దొట్రిలఁబోని శతఘ్నులున్ బలెన్. 307
మ॥ కరముద్రేకముతోఁ దరంగతతు లాకాశంబునున్ సోఁక సా
గర మధ్యంబున శిర్షమెత్తి లవమున్ గంపింపఁగాఁ బోని దు
ర్భర భీతిప్రద గండశైలము వలెన్ రాణా ప్రతాపేంద్రుఁ డ
క్బరు నేనాంబుధి చుట్టినప్డు నిలువంగానేర్చు శౌర్యోగ్రుఁడై 308
మ॥ ధరణిన్ గల్గిన రాజు లందఱ బలౌద్ధత్య ప్రభారేఖ న
క్బరు దుస్సాధుఁడటందు; వీశ్వర కటాక్షంబున్న నాస్వామి యొ
డ్కరుఁ డవ్వానినిఁ బట్టి గావుగొను; భూకంపంబు దుర్వార భూ
ధరమున్ ఱెప్పయు మూయు లోపలనే పాతాళంబున దింపదే. 309
మ॥ ఘనుఁ డయ్యక్బరు మాట యేమిటికి; నక్చర్, వానినేనల్, స్వదే
శనృపాలుర్, మఱి భారతక్షితీయు, విశ్వంబెల్ల బైనెత్తి వ
చ్చినఁ దానొక్కఁడనంచుఁ గొంచెమయినన్ జింతింపఁ డువ్వెత్తుగాఁ
గొని జృంభించిరసాతలంబునకు నుగ్గున్ నూకఁగాఁ ద్రొక్కెడున్.310 310