పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

135


    వెలసెడి దేశమెల్లఁ బెనుబీడుగఁజేసె, వివేక మున్నదే
    యెలుకలదాడి కోడితనయింటికి నిప్పిడు కూళలుందురే? 220
    
ఉ॥ ఆదిమ సూర్యవంశభవుఁ డంట, తురుష్కులఁ జేరి కొల్వఁగా
    రాదఁట నల్వులెవ్వరొ పరాక్రమ వాక్యము లాడినంత మా
    మీఁదీకిఁగాలుదువ్వునఁట, మేము భయంపడి దూరమున్న మ
    ర్యాదఁట' కాక రేగినను నంతయు చేయు నటంట, వింటివే 221

మ॥ మఱి నాయొద్దను జేరుభూమిపతులన్ మర్యాదతోఁ జూడనో
    ధరణీభాగము లియ్యనో! పిలిచి బాంధవ్వంబు చేకూర్పనో
    చిరమైత్రిన్ విహరింపనో నృవులు నన్ నేవించిచేదేమి మే
    సిరి! తానింతటి మౌర్ఖ్యమేమిటికి? దాల్చన్ చెప్పఁగాఁ జాలుదే 222
    
సీ॥ నేఁగోరునదియెల్ల నిఖిలభారతఖండ
               భాగ మొక్కండేల వలయు ననియె
    యెపుడిర్వురు స్వతంత్రు లిటనుండఁ జోటుండ
               రాదు: లోకము పెద్ద రాజననుచు
    నంగీకరించె నన్నాతఁ డంగీకరిం
               చిన దాన నిసుమంత చేటుగలదె
    తనకిరీటంబు క్రిందను వ్రాలునే వట్టి
               పెడసరకట్టె యన్పించు కొనుటె
               
గీ॥ కాని: నేరేఁగినను నాపఁగలుగువార
   లేరి' దానెంత తనదేశ మెంత!తనదు
   సేనయది యెంత హృద్బందు లైనమిమ్ము
   వంటివారలఁ గని యూరకుంటిఁగాక. 223
   
సీ॥ నిజము చెప్పుటకేమి నీవాతనినిగూర్చి
               పలుమాఱు గడు గారవంబునెరపి
    పలుకుటఁ చేసి నీభావ మెచ్చటనొచ్చు
               నోయంచు నెట్టులో యోర్చియుంటి
    "నీవాఁడ" ననుమను నేనేలనీకిష్ట
               మైనట్టులతని మర్యాదచేయు