పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

   మతఁడు స్వతంత్రుఁడై యలర రాదనికాదు
            దేశ మొక్కటిగ వర్దిల్లవలయు
            
గీ॥ ననుచు నింతగఁ జింతింతు నవనిమౌర్ఖ్య
   మంతకంతకుఁ బెరిగె: రాజ్యంబు పాడు
   వడియె: నేమనఁ గూడక యెడరుపడితి
   హృదయశల్యము పాయు చొప్పెఱుఁగ నైతి 224
   
చ॥ విను కడమాటగా వినుతుఁఁ బెద్దయుఁ గాలముగా శరీరమున్
    దినియెడి రాచపుండువలెఁ దీరని వ్యాధియుఁబోలె నాప్రతా
    పునిదేసనైన చింతఁదనువున్ మనసున్ ప్రణమయ్యె; నేగతిన్
    దినములుదాటుఁ! దీఱదిది దేహముతోడుతఁగాని ఈజనిన్. 225

మ॥ ఆకటా చల్లఁగనింట నన్నిలిపి యాయస్తాద్రి యందుండి చూ
    డ్కికివ్రేఁగౌ ముదయాద్రిదాఁకఁ గల దిగ్దేశమ్ములు గెల్చి లా
    భకళల్ నించెడు నీవు నాప్తమణివై వర్తించియున్ జింతఁ బా
    యక నేనెప్పుడు క్రుంగిపోవలనెఁ గట్టాః దైవమెబ్బంగిదో. 226
    
-**అక్బరు చక్రవర్తికి మానసింహా ప్రభువుమనస్తాపోపశమనము చేయుట_**

మ॥ అని యాస్యంబును వాల్చిచూపు ధరపై వ్యాపింపఁగాఁ జేసి చిం
    తనుసూచింపఁగ మానసింహుడు ప్రచండ ప్రాభవోద్దండుఁ డా
    తనివీక్షించుచు "దీనికింతపడిఁ జింతన్ బొందఁగా నేటి; కి
    పనినీకోరిన యట్లు తీర్పఁగను మద్భారంబు: నీకేటికిన్.227

ఉ॥ ఇంతకు నీవుకోరుపని నెవ్వరికేనియుఁ దప్పుపట్టఁ గా
    సంతయుఁ జోటులేదు. జగమంతయు సేమము నొందు సౌఖ్యసి
    ద్ధాంతమె చూపినావు। తఱియైనపు డమ్మహనీయుఁ జూచి త
    త్స్వాంత మెఱింగి వీలయిన యట్టులు కార్యము నిర్వహించెదన్ 228
    
సీ॥ అతఁడు మాకులముల కధిపతి; యతని శ్రే
              యముఁ జూడ మాధర్మ మండ్రు; కాని
    యెప్పటి మాటలో: యెన్నటిజోలియో
              వినుటయే యతని నేఁగని యెఱుంగ