పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


     క్షీరాంభోనిధి క్రూరబాడబ మహాగ్నిజ్వాలచేఁ బోలెఁ గం
     గారౌచుండును; దాని బాధలకు గ్రుంగన్ సాగితిన్ బెల్లుగన్ 213
     
మ॥ అది యెవ్వారల తోడనేఁ దెలుపరా దద్దాని నెవ్వారు తీ
    ర్చెదమన్నన్ మఱి తీరఁబోవ దెపుడున్ జింతించి చింతించి నేఁ
    దుదిదాఁకన్ మది నోర్వనే వలయు; నెంతో కూర్చు మిత్రుండ వ
    య్యది నేఁచెప్పిన నీదుమానసము చింతాయత్తమై క్రుంగెడున్. 214
    
చ॥ ఇరువదియేండ్లుగాఁగ సహియించుచు నుంటిని; యెన్ని మార్లొ నీ
    వెఱుఁగవుగాని యేకతమ యిర్వుర ముండిన యప్డునావ్యధా
    భర మిటులుండెనంచుఁ దెలువన్ గమనించితి; నంతలో హృదం
    తరము కలంగి మాటయయినన్ వెలిదాటక నిల్చిపోయితిన్. 215
    
చ॥ ఒకయెడ సింధువాహిని మఱొక్కెడఁ బూజ్యము బ్రహ్మపుత్ర యిం
    కొకయెడ వింధ్యభూమిధర ముత్తరమందు హిమాలయంబు వీ
    నికి నడుమన్ గలట్టి యవనీస్థలి నాపరిపాలమ్మునన్
    వికసన మొంది భూప్రజయు నేనును సౌఖ్యముఁగంటి మెంతయున్. 216
    
మ॥ ఆరులెల్లన్ నశియించి; రక్బరన నాహా! యంతరాజేఁడి యం
    దురు; గర్భంబు ఫలించి పుత్రికలు పుత్రుల్ గల్గి; రత్యంత భా
    గ్యరమల్ పొల్చెడి; కోటిమంది హితు; లింకన్ బ్రాయమోస్వల్ప మే
    కొఱఁతల్లేవు; మహోన్నతస్థితులె నాకు జెల్లె నేనాఁటికిన్. 217
    
మ॥ అమరాధీశుఁడుగూడ నాసవడు నార్యావర్త దేశంబు స
    ర్వము నాఛత్రము క్రిందీకైనడిచె, మేవాడ్ రాజ్య మొక్కండుమా
    త్రము సాతంత్య్రర మాభిమానముల మత్ప్రాజ్యాధికారంబు లే
    శము మన్నింపక గర్వముల్ బలిసి శీర్షంబెత్తి క్రేణించెడున్. 218
    
చ॥ ననుగడుఁబేర్మిమైఁ గనుచు నాప్రభుతన్ మదిమెచ్చి కన్య ని
    చ్చిన మిమువంటివారి వెలిచేసి ప్రతాపనృపుండు పంక్తిభో
    జనములకైన నించుకయు నైపక తేలికచేసిచూచె, మీ
    ఘనతకు హానివచ్చినను గల్గవే నాకు విషాద వేదనల్ 219
    
చ॥ కలుగఁగరాదు లాభమొక కాసును నాకని దేశమందు లో
    కులఁ బురముల్ త్యజించుచును గొండలనుండఁగఁ బిల్చి సంపదల్