పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

133


    నిలయమైయుండఁ జూడఁగా వలయు ననుచుఁ
    గడుపులోఁ గొండ యంతాస గలిగే నాకు 210
    
సీ॥ సింహాసనం అధిష్ఠించినదాది నీ
             భావమేమది వేరు పాఱియుండె
    నాగ్రా మొదల్గాగ ననుదినం బొక్కొక్క
             రాజ్యంబు గెలిచి రాష్ట్రమునఁజేర్చి
    ప్రాధాత మృదుగంధ వహునట్లు భారత
             మేదినీతల మాక్రమించి ప్రజల
    కామోద సౌభాగ్య మలవరించుచు రామ
             రాజ్య విఖ్యాతిఁ గూర్పంగఁ గంటి
             
గీ॥ నొందొ యొక రిరువురు రాజ్యతృష్ణచేత
   నక్బరును దిగ్జయ మొనర్చు నండ్రు గాని
   సత్యమీవెఱుంగవే. ధాత్రి జనులెఱుఁగరె
   భువనములనేలు నాదిడేవుం డెఱుఁగఁడె 211
   
సీ॥ సహగమనము భీతి సడలించియుంటి, న
             న్యాయమౌ పన్నుల నణఁచియుంటి;
    మధుమాంస సేవన మాన్పితిః భారత
             నృపులతో వియ్యంబు నెఱపుచుంటి;
    నొకకంట నమృత మింకొకకంట సున్నంబు
             గలిగి వీక్షింప; మోగలులు హైంద
    వులటన్న భేదంబు గలుగదు; మీలోన
             మత్ప్రాణసము లెంత మందిలేరు
             
గీ॥ భారతాభ్యుదయముఁ గూర్చి పవలు రేయు
   నేనుపడు బాధలా దేవుఁడే యెఱుంగు
   నీకుఁ జెప్పినఁ దప్పున్నదే కనులకు
   క్షణము సేపైన నిద్దుర గదియరాదు 212
   
శా॥ రారాజై మితిలేని సౌఖ్యభరమున్ బ్రాపించి యున్నాఁడటం
   చీరెన్నందగుఁగాక,. నాదు హృదయం బెప్డొక్క చింతాగ్నిచే