పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ నదియుఁ గోప కారణమయ్యె సక్చరునకు
    మానసింహుఁడు తోడర మల్లువీర
    బలుఁడు ఖాసీముఖానాది ప్రబలవీరు
    లండఁ గొలువుండ వేడలె బ్రహ్మాండ మద్రువ. 206
   
మ॥ అమర ద్వీపవతీ తటాంతరమునన్ హాజీపుర ప్రాజ్వ దు
    ర్గమునున్ జేకొని పాటలీ నగర దుర్గంబున్ గొనెన్! బెక్కు యు
    ద్ధములన్ జేసి విహార వంగముల నా తర్వాత నోఢ్రంబునున్
    గ్రమమొప్పన్ గ్రహియించె నక్బరు సమిద్దాండీవి యీతండనన్. 207
    
క॥ పరిపూర్ణ విజయమున న
   క్బరు ఢిల్లీపురముఁ జేరి కడు సంతోష
   స్ఫురణమున మానసింహుని
   సరసకుఁ బిలిపించి గోష్ఠి సలిపెడువేళన్. 208
   
**అక్బరుసార్వభౌముఁడు కున్వార్ మానసింహప్రభువుతో మంత్రాంగము చేయుట**

మ॥ పదమూఁడేడులు దాఁటిదాఁటకయె లేఁబ్రాయంబునన్ దండ్రియున్
    ద్రిదివం బేగెను; నాఁటినుండియు ధరిత్రీ రాజ్యధారంబు నన్
    గదిసెన్ ; దేవునికూర్మి సర్వమును జక్కన్ దాల్చి కల్యాణ సం
    పదలన్ లోపము గల్గకుండ నెపుడున్ వర్ధిల్లఁగాఁ జేసితిన్. 209
    
సీ॥ తెగిన హారమున ముత్తియములువోలె భా
             రతరాజ్యమది పెక్కు వ్రక్కలగుచుఁ
    జిన చిన్నపాయలై చెడె; రాష్ట్రపతులలో
             నొండొరులకు మైత్రి దవదెపుడు
    నిత్వలక్ష్మీ శుభ నిలయములై యుండ
             వలయు రాజ్యములు శాశ్వత రణముల
    ధనజన వస్తువాహన శూన్యమైపాడు
             వడి శ్మశానములట్లు ప్రభఁ దొలంగె
             
గీ॥ నిట్టి కుబ్జావతారంబు లెల్లఁబోయి
   భరతఖండ మఖండైక భాగ్యవిభవ