పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

జ్ఞలు అవియన్నియు వ్రాసినచో పట్టరానంత గ్రంధమగును. ఈ కవి సార్వభౌముడు ఈఘట్టము చిత్రచిత్రములుగా వ్రాసెను మొదటనే చెప్పితిని గదా "ఈ గ్రంధము యుద్ధపంచకమువలె నున్నదని, ప్రతాపుఁడు దేశమంతయు బీడు పెట్టించి తన్ను సేవించు నందరిని వెంటఁదీసికొని కుంభల్మియరు దుర్గములో గూర్చుండును సలుంబ్రాకృష్ణుఁడు - భానుసింహుఁడు - మనస్సింహుఁడు శ్యామసింహుఁడు... తేజస్సింహుఁడు - రామచంద్రదేవుఁడు - భిల్లనాయకుఁడై న భీమచాందుఁడు వీరందఱు తమతమ రాజభక్తులను తెల్పిరి. వారి రాజభక్తి తెలుపుటలను చదివియే చూడవలయును. ఈబైరాగియైన ప్రతాపునకు_ఆమహా రాజైన అక్పరునకు విరోధము. భోగసన్న్యాసమున ప్రతాపుడు, రాజ్యతృష్ణ చేత_అక్బరు, తన చేతిలో చిక్కిన మోగలు సైన్యమును ప్రతాపు డెన్నిసారులో వదలిపెట్టెను ప్రతాపుని యీ కట్టుదిట్టములు చూచి అక్బరు భయపడెను. ప్రతాపుని గెలువలేనవని కాదు. ప్రతాపుని మీదికి పోయినచో తన కండగా నున్న రాజపుత్ర సేనానులకు కోపము వచ్చునని, అతఁడు దీర్ఘదర్శి-అప్పటి కప్పుడు భేదము పన్నుట కాకపోయినను భేదము పుట్టుటకు నొక సన్నాగము పన్నెను.........

     "నముఁగడుఁ బేర్మిమైఁ గనుచు నాప్రభుతన్ మదిమెచ్చి కన్య ని
      చ్చిన మిమువంటివారి వెలిచేసి ప్రతాపనృపుండు పంక్తి భో
      జమున కైన నించుకయు సైపక తేలియకచేసి చూచె మీ
      ఘనతకు హాని వచ్చినను గల్గవె నాకు విషాద వేదనల్

ప్రతాపుఁడీ కులము చెడినవారితో భోజనము చేయఁడు. కులము చెడుట తప్పని ప్రతాపుని యుద్దేశము. ఒక జాతియొక్క జాతీయతలో వర్ణ భేద ముతర్భూతమని వారి యుద్దేశము..... తరువాత అక్బరిట్లను చున్నాడు.

     "మఱి నాయొద్దను జేరు భూమిపతులన్ మర్యాదతోఁ జూడనో
      ధరణీభాగము లీయనో పిలిచి బాంధవ్యంబు చేకూర్పనో
      చిరమైత్రిన్ విహరింపనో నృపులు నన్ సేవించి చేదేమి మే
      సిరి? తానింతటి మౌర్ఖ్య మేమిటికిఁ దాల్చెన్ జెప్పఁగాఁ జాలుదే"