పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

   తల నేతేర, బ్రతాపసింహుఁ గొలువన్ నానామహీమండ లేం
   ద్రులు వేంచేసి రుగాది కానుకలు దొంతుల్ దొంతరల్ తెచ్చుచున్

అప్పు డందఱు వేఁటకుఁబోయిరి. ఈ వేటకుఁ బోయినపుడు రాజపురోహితుఁడైన హరభట్టుగూడ వెళ్లెను ఈ పురోహితులుగూడ వీరులే. రాజులకు ప్రాణములు ధారవోసినవారు ఐహికాముష్మికములకు చేయూత యైనవారు.

వేఁటయైన తరువాత కూర్చుండి మాటలాడుకొనుచుండఁగా నొక వరాహము వారి నడిమికి వచ్చెను దానిని అన్నదమ్ము లిద్దఱు సూక్తుడును ప్రతా పసింహుడు - తమ బాణములతో గొట్టిరి. నేను చంపితినన నేను చంపితినని తగవులాడిరి. సూక్తుఁడు ప్రభువుతో నన్నగారితో వివాదము పెంచెను. సలుంబ్రా కృష్ణునిగూడ లెక్క సేయలేదు. హరభట్టు సూక్తునకు నీతి సుపదే శించెను. ఆ పురోహితునితో సూక్తు డిట్లు పొగరుపోతు తనము ప్రకటించెను.

    "తనదౌ శక్తికి మీఱు కార్యములకున్ దార్కొన్నచో ముప్పు వ
     చ్చును మాయిర్వురలోన నొక్కఁడు రణక్షోణిన్ మృతిన్ గన్న మీ
     రును రావచ్చును నేడ్వవచ్చు మఱి పౌరోహిత్యమున్ జేయ వ
     చ్చును లబ్ధిన్ గొనవచ్చు నిప్డు చనవచ్చున్ దాఁటి దూరంబుగన్
 

అంత హరిభట్టు వారి యుద్ధ మాపలేక వారి నడుమ తాను కత్తి పెట్టు కొని పొడుచుకొని చచ్చెను.

"నాటి కష్టదశన్ దీర్పన్ బూని యాత్మార్పణంబు నొనర్చెన్ హర భట్టు త్యాగనిధియై ముల్లోకముల్ మెచ్చఁగన్.”

అంత యుద్ధము సమసిపోయెను. "గురు రుధిరంబు దాటగను కూడదు. అని ప్రతాపుఁడుయుద్ధమును మానివేనెను సూక్తుఁడు దేశమును వదలి పోయెను. ఎచ్చటికి బోయెను?

“ తా, నరిగెను ఢిల్లీత్రోవకు కులాంతకు లందఱు పోపు తావుకున్ "

ఇచ్చటినుండి ప్రతాపుని శౌర్యాగ్నిరాజి మండి, యత్యుగ్రమై, పాతికయేండ్లు తగులబెట్టిన ఘట్టము. ఆశౌర్వము, ఆయుద్ధములు, ఆప్రతి