పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఇంత రాజనీతి అక్బరు ప్రకటించెను. ఇట్టి రచన సామాన్య కవి చేయునదికాదు. ఇది తిక్కనాదులు చేయఁదగ్గది మానసింహుఁడు ప్రతాపుని యొద్దకుఁబోయి అక్బరును గుఱించి యెంతయో పొగడెను. మానసింహుని వంశమునకు ప్రతాపుని వంశీయులు గురువులు, ప్రతాపుఁడు మానసింహుని పొగడిత విని అక్బరు రాజనీతి మానసింహునికి విఱిచి చెప్పెను.

  "నిగూఢ మాతని మనోవ్యాపార లీలాగతుల్ "
  “అల్లుడై-బావయై - మామయైన తన్ను
   వెలితి గననీక శ్రీ మహావిష్ణు నట్లు
   భారతీయులు కొలుతు రన్ భావమెఱిఁగి
   అక్బరటు చేసే హేతు వన్యంబు గలదె.”
  

అని చెప్పెను అంత చల్లెగాఁ బాలించు నక్బరు రాజ్యములో ఘోర్ఖర దేశమున క్షామము. అక్బరొకవంక దిగ్విజయమును చేయుచున్నాడు ధనేశ్వరమ్మున సన్న్యాసులలో - సన్న్యాసులకుఁ బోట్లాట పెట్టి తానొక పక్షము చేరి, వారందఱిని నాశనము చేసినాఁడు. యిందు ప్రతాపుని యొక్క ధర్మమననేమో; నిజమైన రాజెట్లుండ వలయునో, ఆప్రతాపుఁ డెట్లు నిజమైన రాజో ఈ ఘట్టమంతయు చదివినచోఁ దెలియును. ప్రతాపుడు ప్రకృతి బిడ్డ. భోగవిముఖుఁడై నరాజు. భోగాభిముఖుడైన రాజువలన లోకములో, గొంత భాగము తిండిలేకుండఁ బోవును.

  “అకాపట్యము లాదరస్మితము లాయౌదార్య మావియ్య మా
   మోకాల్ మ్రొక్కులు నాచమూ విభవ మా ముప్రొద్దు సేవించుటల్
   నాకెత్తున్ దలనొప్పి పట్టణము లన్నన్ మీకు నెట్లుండునో
   నాకీ కొండలువోలె సౌఖ్య మిడు శాంతస్థానముల్ లేవుపో!
   
ఇది ప్రతాపమూర్తి అనిన, మానసింహుఁడు,

   ఈ యేరిటు పాఱఁజొచ్చె నెదురీద నెవండు సమర్థుఁడౌ వృధా పౌరుష మున్న
   దంచు బడబాజ్వలనంబును బాఱమ్రింగెదే!”
   

అన, ప్రతాపుఁడు ఒక చిన్నకధ (Parable) చెప్పెను. ప్రతాపుఁడు గాంధీ వంటివాఁడు - యేసుక్రీస్తు వంటివాడు - మహర్డుల వంటివాఁడు