పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ దస్యు గళరక్తముల వసంతమ్ములాడి
   నీదు కరవాల మెచటఁదానై దళకొని
   సకలమును దీర్చు నాగపసాని గాఁగ
   విజయలక్ష్మి వరించి నిన్ బెండ్లియాడు. 158
   
గీ॥ అని యుపరమించె నంత నాతని సమీప
   మున మహోన్నతరూపుఁడై మూర్తిఁ గొనిన
   వీర రసవార్ధియో యనఁగూరుచున్న
   భిల్ల లోకైక నాధుఁడా భీమచాందు. 159
   
-: భీమచాందు తన సాయమును వివరించి చెప్పుట. :-

సీ॥ కాండ్రుకాండ్రని పెద్దగా మ్రోఁతల నిగిడ్చి
            గబ్బి బెబ్బులి పిండుబొబ్బరించు
    శైలముల్ పగిలి పచ్చడిగాఁగ ధ్వని చేసి
            సింహ పోతములు గర్జించు చుండుఁ
    జేయెత్తు లేచి వచ్చి విసంబు వెదచల్లి
            కోడెనాగులు బుసకొట్టుచుండు
    వసుధ యిట్టటు లాడబరువై పరువులెత్తి
            యేనుంగు గుములు ఘీంకృతులు సేయుఁ
            
గీ॥ బద్మిజాతాండ మంతదై భయము గొలుపు
   గండశిలలఁ గొండలు చుట్టు నిండి యుండుఁ
   బ్రమధ యుతుఁడైన కైలాస భర్తకైనఁ
   జాలునే గుండె నాదు రాజ్యంబుఁ జొరఁగ.160 160
   
సీ॥ భూలోక నాకమౌ బోయెపాళెం, బుండుఁ
           జందన తరువరచ్చాయ లుండు
    గొలువుకూటంబుండుఁ గోడె గుబ్బెతగముల్
           వింజామరమ్ములు వేచుచుంద్రు
    బొమిడికంబుల భిల్లపుంగవుల్ నడదివ్వె
           లగుదు రందఱును నీయాజ్ఞ నుంద్రు