పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

121


    నాయాత్మకెంతొ యానందమౌ నాదు సిం
              హాసనంబందు నీవధివసింపు
గీ॥ మండఁ గూర్చుండి క్షణమైన నవలఁబోక
    కొలిచి దేవునకట్లు సేవలు ఘటింతు
    నడుగు మన్నౌట కోర్వ నా హస్తయుగము
    జాళువా పట్టుదిండుగా సంతరింతు. 161
    
మ॥ సరియంచున్ దలయూఁచి చూడు మఱి నా స్వర్గంబు నందైన ని
    ర్ణరులున్ ముప్పదిమూఁడుకోట్లెపుడు పూజల్చేసి సేవించు న
    ప్పురుహూతుండును జూచియుండని సుఖంబుల్ భోగముల్ వచ్చి దొం
    తరలై చుట్టునుజేరి కొల్చు నిను మద్వాక్యంబు నాలింపుమా. 162
    
మ॥ అకటా! నీయెడ నెయ్యపున్ బలిమి నేనట్లాడితిన్ గాక యే
    టికి నాప్రార్ధన మియ్యకొందు వెపుడున్ డెందంబునన్ దేశమా
    తకు వాటిల్లు విపత్తుకై వగచి చింతన్ గ్రాఁగు నీ వగ్గి మ్రిం
    గక స్వాతంత్య్రము దక్కు దాఁక నొకచోఁ గాలూని కూర్చుందువే. 163
    
సీ॥ జాతియు జన్మదేశమును భిన్నములైన
             మనపూర్వులకు మైత్రి దనరకున్న
    నాకన్న వయసు సుంతగఁ దక్కువైన బా
             ల్యమున నొండొరుఁజూచినది మొదలుగ
    నీపైన నవ్యాజనియతి నామది నిల్చె
             రెండవ దేవుడన్ రీతిఁజూతుఁ
    గడఁబోదు వీదు జాగ్రన్మంగళాకృతి
             కలనైన హృత్ఫలకముననుండి
             
గీ॥ నీవు పాల్గొననట్టి యీనిఖిలలోక
   సార్వభౌమత సరక వాసముగ రోతు
   నండ నీవున్న సంబలినైన నమృత
   మట్లు సేవించి యానందమంద నేర్తు. 164 164
   
సీ„ అహితదై తేయ పశ్యత్ఫాలమూర్తులౌ
             శౌర్యదుర్జయు లొక్కజాతివారు