పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

119


చ॥ అజిత పరాక్రమంబున మహాహవసీమలఁ గత్తి మోసి నా
    బుజముల కాయగాఁచెఁ గడుఁబూర్వుఁడ వృద్ధుఁడ నైతిఁగాని నీ
    విజయరధంబు మోయ భుజవీర్యము పట్టున లోటులేదునే
    గజిబిజిచేసి శాత్రవులకండలు మెండుగ రాల్తు మేదీనిన్. 155
    
శా॥ చండారాతి కులాటవీ దహన శశ్వత్కీర్తి సర్వస్వ మీ
    తఁ డొక్కండె ప్రపంచమందుఁగల మద్భాగ్యంబు నాకూన యీ
    ఖండేరావు కురంగముల్ దునుము వ్యాఘ్రస్వామివోలేన్ బలో
    ద్దండుండై తెగటార్చు వైరులఁ గృతాంతప్రాయుఁడై యాజిలో. 156

సీ॥ పగఁబట్టి వచ్చి బేబరు సర్వభక్షకుం
              డయి గ్వాలియరును గొన్నయది మొదలు
    నెట్టిసాయము లేక యెందొ రెక్కలు లేని
               పక్షినై పడిన యీబడుగునన్ను
    మేవాడఁ జేరిచిమీతాతగారు స
               హస్ర హస్తములతో నాదరించి
    రతని యనంతరం బభిమాన మెనయఁ దం
               డ్రివిధాన నోమితి నీఋణంబ
    
గీ॥ వేయిజన్మంబు లెత్తి నీవిమత నృపుల
    నసమ రణభూమిఁ జీల్చి చెండాడియైన
    దీర్పఁజాలమి సత్య మీదేహ మెపుడు
    త్వత్పద సమర్పితంబు భూధవ కులేంద్ర. 157
    
సీ॥ నిత్యకల్యాణ మందిరము చిత్తూరు మం
               డలము వివాహిమండపము గాఁగ
    రంగుగుల్కు ననేకరాజపుత్ర స్యంద
               నమ్ము లై రేని కుండలునుగాఁగఁ
    గృష్ణసింహాది వీరేశ్వర దోఃప్రతా
               పస్ఫూర్తి రత్న దీపతతి గాఁగ
    యవనభూధవ కిరీటాలి నిర్గతమణుల్
               వజ్రరంజిత రంగవల్లి గాఁగ