పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

117


మగనిసువు గల్గ నది రాల కెగురుఁగాక
యమరులు నుతింత్రుగాక! నీ విమల యశము 147

సీ॥ “ప్రాభవం బిత్తు రాష్ట్రమునిత్తు ధనమిత్తు
             రాణాను విడనాడి రం" డటంచు
    ఢిల్లీపురంబునుండి దినంబు వచ్చు లే
             ఖల నొక్క కొట్టంబుఁ గప్పవచ్చు
     ద్యాగైకమూర్తి ధర్మావతారా నీము
             ఖము నొక్క మాఱు దూరమున నుండి
     కనువిందుగాఁగఁ జూచిన వాఁ డెవండైన
             నీ నీచతరమార్గ మెట్లు సొచ్చుఁ
             
గీ॥ బ్రాణములతోడ నిన్నెడఁ బాయఁ గలుగు
    వాఁడొకఁడు లేఁడు నీదు సేవకులలోనఁ
    జెంతఁ జింతామణిని వీడి చిల్లిగవ్వ
    కెగుబుజము చూప నెవ్వాని మొగమువాఁచె 148
    
సీ॥ హారావళీ భూధ రావతంస ప్రాంత
          సానురాగము యజ్ఞ శాల గాఁగఁ
    బావనాత్ముఁడు చంద్ర భట్టారకు కవిత్వ
          ధారలు వేద, మంత్రములు గాఁగ
    నల సలుంబ్రాది కిరా తాధీశు లసమాన
          విక్రమక్రములు ఋత్విజులు గాఁగ
     శార్ఙ్గసన్నిభ బల స్థౌల్యశోభితము నీ
          పటు మహాధనువు యూపంబు గాఁగ
          
గీ॥ బ్రబల యవనసేనలు పశు ప్రతతిగాఁగ
   యాయజూకుఁడవై దీక్ష నవధరించి
   సవనమును దీర్చి జగము నిర్యవనముగను
   జేసి త్రైలోక్య నుతుల రం జిల్లవయ్య! 149 149
   
శా॥ ‘ఔరా! శాత్రవకోటి పాలిఁటికిఁ బ శ్యత్ఫాలమూర్తుల్ గదా
    యీరారోణ్మణు' లంచుఁ జిత్తురు రణం బం దందఱెన్నన్ రవి