పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    చేఁదంతయునుదగ్గి శీతమై తీయనై
              నిమిషమ్ములో నమృతముగ మాఱుఁ
              
గీ॥ ద్వత్పదము లెంతి కొలిచినఁదనివి లేదు
   నీయనఘనామ మెంత ధ్యానించుచున్న
   విసుగు గనుపింప దింకను విడక కొలువ
   ధ్యాన మొనరింపఁగాఁ గోర్కి యగునుగాని. 145
   
సీ॥ ధర్మసంస్థాపనార్థము ధాత్రి మెలఁగు దే
               వా! యేక లింగాపరావతార
    పదినూఱులేండ్లు యావననృపుల్ భరతఖం
               డమునకుఁ గూర్చ బన్నములు వాని
    వారింపఁగాఁ బూర్వవీరుల త్యాగంబు
               ప్రస్తుత కార్యకర్తవ్యములను
    నెఱిఁగించుచో నీదుమృదులాతిమృదుల భా
               వం బెంతనొచ్ఛె దైవమ యెఱుంగు
               
గీ॥ వినుకొలఁది చిచ్చుదరికొన్నవిధమ తోఁచే
    సైన్యబల మల్పమని కాని చాలియున్న
    దలను బూవాడ కింట నిన్నిలిపి నేనె
    రిపుల సర్వనాశన మాచరించి యుందు.146 146
    
సీ॥ భువనపావన నీవుపూనిన కృతి జగ
              ద్వంద్య మందఱము దోద్పడఁగఁ గలము
    రణ మహోత్సాహ వర్ధనమైన సుముహూర్త
              మెంచి సూర్యధ్వజంబెత్తి నిలుపు
    కలికి బంగరు చిఱుగజ్జెల మోత మో
              గలులు యామ్యమహిమషకంఠకాంస్య
    ఘంటా నినాదంబుగా వినెదరు గాక
              ధ్వజము చుట్టుందుము బలిసి కొలిచి
              
గీ॥ పులులఁ బోలిన చరణ దాసులము మేము
    కడకు మేవాడ నొకచిన్న కత్తిపట్టు