పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

115

గీ॥ గ్రూరతౌరుష్కతతుల నీ మ్రోలఁ బట్టి
    కసిమసఁగ నేర్తు మననేర్తుఁ గాని నిన్ను
    విడువ నేర్తునె: ప్రాణముల్ విడిచి యైన
    నరుణ కేతన చ్ఛాయలఁ దిరుగ నేర్తు 140

మ॥ మిడియెండై నను నర్ధరాత్రమయిన మిట్టైన గుంతైన నె
     క్కుడు వాఁడైనను లొచ్చువాఁడయిన మీకున్ దోఁచినట్లాజ్ఞ పె
     ట్టుఁడు! ముందున్ మఱి వెన్కచూడకయె పిడ్గున్ బోలె వైరివ్రజం
     బడఁగన్ దాఁకెదఁ! జూడు వేయునుడులేలా ముందుఁగార్యంబులన్.141
     
మ॥ కడప్రాణంబులు బొంది వీడి చనుదాఁకన్ నిన్ను సేవింతు: నె
    క్కుడు దర్పోన్నతి సంగరాంగణములన్ ఘోరారి సంఘంబులన్
    దొడరన్ బోయెద; వీడ కందఱను గొంతుల్ గోసి తద్రక్తముల్
    మడవల్ గట్టెద! దేశమంతట యశో మందారముల్ పెంచెదన్" 142
    
క॥ అని వచియింపఁ బ్రతాపుఁడు
   తన చెంతను ధైర్యపర్వతమువోలె వసిం
   చిన బదనూర్ నరపతిఁ జూ
   చిన పదనం బెత్తి తేజసింహుం డంతన్.143

-: తేజసింహుఁడు తన తెఱం గెఱింగించుకొనుట.:-

మ॥ "అవనీభారము హెచ్చి ధర్మములు వ్యత్యస్తంబులై పోవఁ బూ
     ర్వవికాసం బలరింప నీశ్వరుఁడు స ర్వజ్ఞుండు మీవంటి మా
     నవమూర్ధన్యుల రూపమొంది యిల జ న్మంబెత్తు దర్శనా
     దివిశేషంబులు లోక మంతటికి సంధించున్ మహాశ్రేయమున్.144
     
సీ॥ ఒకయెత్తు నీవు వేఱొక యెత్తుగా దైవ
            కోటి నిల్సిన నిన్నె కోరుకొందు!
    స్వామి యీ నీ పద ద్వయి విశ్వపూజ్యంబు!
            నడుమ త్రోవను నీవు నడచు నప్పు
    డడుగు సోఁకిన ధూళి యణుమాత్రమంటిన
            నఖిలలోకముఁ గాల్చు హాలహలము