పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



   స్వర్ణజయఘంట మ్రోయించి జయము గాంచి
   ధర్మసంస్ధాపనాచార్యతను వహింపు. 135
   
గీ॥ దస్యు శవకోటిపైన మద్భటులు నేను
   దనువులను వాల్చి నీవు స్వాతంత్య్రలక్ష్మి
   కలవఱచు రత్న దేవాలయమ్ముఁ జేరఁ
   బరచఁగల మయ్య కనక సోపానపంక్తి. 136
   
మ॥ పనులెల్ల సమకూరె మీవినయసేవల్ తృప్తి సంధించె స్వ
    స్వనివాసంబుల కేగుఁ డంచు భవదాజ్ఞల్ వచ్చుదాఁకన్ దినం
    బును భూశయ్యయు నేకభుక్తము వ్రతంబున్ బూని వహ్నిన్ జొరుం
    డనినన్ దక్షకుఁ బట్టుఁడన్న వెనుదీయన్ బోము రాజేశ్వరా.137
    
శ్యామసింహుఁడు తన నిశ్చయ మెఱిగించుకొనుట.

క॥ అని వచియించిన నుగ్రా
   శనితుల్యుఁడు శ్యామసింగు సాద్రీశ్వరుఁ దో
   యినవంశాభరణా నా
   యనుజుని మార్గమునె నేను ననువర్తింతున్. 138

ఉ॥ ప్రాణము తీపుగాదు కర వాల భుజంగికిఁ గ్రూరశాత్రవ
    ప్రాణసమీర మిచ్చి విజయంబు యశంబు గడించి నిత్యక
    ల్యాణము లొందు టొక్కఁడు; మహాహవ రంగములందు వ్రాలి ని
    ర్యాణమునొందు టొక్కఁడు ప రాక్రమపూజ్యము రాజకోటికిన్. 139
    
సీ॥ విశ్వంబు నగలించు వేడి పిడ్గులనైనఁ
            బువ్వులవలె శిరంబున వహింతు
    శేషాహిపతి నైనఁ జేనెత్తి ముత్యాల
            హారంబువలెఁ గంఠమందుఁ దాల్తు
    హిమవత్కుధరశీర్ష 'మెవరెస్టు' పైనుండి
            దూఁకెదఁ బాతాళ లోకమునకు
    నాత్మగర్ణాస్ఫూర్తి నడవి మార్మ్రోయించు
            మృగరాజు నశ్వ మ ట్లెక్కనేర్తు