పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

113


ఉ॥ క్రూరతురుష్క సంతతులకున్ మఱి నీకు ఘటిల్లు నామహా
    భారత యుద్ధరంగమున ఫల్గున తుల్యుఁడవౌచు నీవు చె
    న్నారఁగ నీపదంబులు హృదబ్జతలంబున నిల్పి మత్స్య ధా
    త్రీరమణుండొకో యన నరిప్రతతిన్ గడతేర్తు నాజిలో. 131
    
మ॥ దివియున్ భూమియు నొక్కఁడై పడిన నాదేహంబునన్ బ్రాణవా
    యువు లున్నంతకుఁ గన్నులెత్తి యహితుందొక్కండునిన్ జూడఁగా
    నవకాశంబు నొసంగఁబోవ; సముద గ్రాటోప మేపార న
    య్యవనాంభోనిధిఁ ద్రచ్చివైచెద జగం బానందమున్ బొందఁగన్. 132
    
క॥ వినిపింపనేల పెక్కులు!
   నినుమ్రొక్కి వచించువాఁడ నీప్రాణము వె
   న్కను మాప్రాణంబులు ముం
   దనిన మనస్సింహుఁడప్పు డందఱు వినఁగన్. 133
   
-: మనస్సింహుడు తన యభిప్రాయము వెల్లడించుట. :-

క॥ ఝాలానృపతులు శౌర్యో
   త్తాలులు పరిసంధి గహన దహన జ్వలన
   జ్వాలాభు లనెడు కీర్తిని
   నేలఁగలుప సాహసింతు నే! నీమ్రోలన్. 134
   
సీ॥ శూరులౌ గ్వాలియర్ సోనెగుఱ్ఱేశ్వరుల్
           ద్రుపద మాత్స్యక్షితీంద్రులును గాఁగ
    సకలసంగరమర్మ సర్వజ్ఞమూర్తి యా
           భీమచాందును యదు స్వామిగాఁగ
    శ్రీసలుంబాకృష్ణ సింహుఁడు దోర్బలో
           ద్దండ సాహసుడు భీముండుగాఁగఁ
    దేజసింహుఁడమాను షాజేయ విక్రమ
           గురుకీర్తి ఘనుఁడు ఫల్గునుఁడు గాగ
           
గీ॥ శ్యామసిం గేను కవలమై యండ నుండ
   ధర్మరాజవై నిలచి స్వాతంత్య్ర రథము