పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    గదలన్ బో!దనిలోన శత్రులను మ్రగ్గన్ జేతుఁ గాదేని నీ
    పదపద్మంబుల మ్రోల వ్రాలివిడుతున్ బ్రాణంబులో యీశ్వరా. 126

మ॥ తనువుల్ నశ్వరముల్; విశుభ్రయశమున్ ధర్మంబు సుస్థాయియై
    తనరారు; వెనుకంజ వేయకు పవిత్రంబైన దీకార్య మే
    యనుమానంబును లేదు; వేగమె రణప్రారంభమున్ జేయుమీ
    నిను సేవించెద నీకు ముందు రిపుపంక్తిన్ జించి చెండాడెదన్. 127
    
-: భానుసింహుఁడు ప్రతాపసింహుని తోఁ దన నిర్ణయముఁ దెలుపుట. :-

గీ॥ అనుచుఁ గేల్మోడ్చి విరమించు నతని మాట
   నందుకొని భానుసింహుఁ డోయధిప! మాకు
   స్వామిభక్తియె రక్తరూపమునఁ బాఱు
   ని న్ననుసరింప కేరీతి నిలువఁ గలము. 128
   
సీ॥ స్వామి స్వాతంత్య్ర ప్రభామనోజ్ఞంబు
            వదనమ్ము భువనసేవ్యమ్ముగాదె
    యకలుషస్వామి భక్తికిని మాచిన్ని రా
           ష్ట్రమ్ములు పూర్వకాలమ్మునుండి
    సూతికాగృహముల శోభఁ జెన్నారు నిం
            దుకుఁ దోడుగా నీమనోజ్ఞ నామ
    సంస్మరణంబు దుస్సాధ దుర్బేద దు
            ర్గముగాఁగ మమ్ము రక్షణము సేయుఁ
            
గీ॥ గంఠమునఁ బ్రాణవాయువుల్ గలుగుదాఁక
   ముందునకె గాని వెనుకవైపునకుఁజూడ
   మరుల కరవాలములు పూలసరము లట్టు
   కంఠములు కౌగిలించిన కాలమందు. 129

చ॥ ముదుసలినైన మోగలు చమూవిసరంబు ముఖంబు భూస్థలిన్
    గదియుచుఁ జీల్చు నాగఁటి వగన్ బగిలించుచు రెండుపాయలై
    చెదరఁగఁజేతు బాణములు చిచ్చఱ పిడ్గులువోలె వైతుఁ గ
    ల్గదు లవమేనియు బిఱికికండ మదీయ శరీర మందునన్. 130