పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

111


శా॥ నా కొక్కించుకయైనఁ గష్ట మెదురైనన్ మేరువున్ గాఁగఁ జీ
     కాకున్ జెందు మృదుస్వభావులరు మీయాశీస్సు శ్రీరామ ర
     క్షాకల్పంబగు ధర్మసూక్ష్మములు నీసందిగ్ధ కాలమ్మునన్
     నాకున్ జెప్పి కృతార్థుఁజేసి కడుఁబుణ్యం బొందఁబ్రార్ధించెదన్” 120
     
క॥ అని వెండికొండ సింహా
     సనమున శివుఁబోలె శాంతిసదనంబగు స్వా
     మినిఁగని భక్త్యావేశం
     బునను సలుంబ్రామహీశ పుంగవుఁడంతన్. 121
     
–: సలుంబ్రా కృష్ణసింహవిభుడు తన నిశ్చయము నెఱింగించుట. :-

మ॥ “ఇవియున్ వీరరసాబ్ది వీచికలుగా నీమాటలున్ గావు; హైం
     దవమందెంచును సత్యధర్మములు సంస్థాపింప మేవాడ భా
     గ్యవిశేషంబునఁ బుట్టువున్ గనిన సాక్షాద్విశ్వనాధుండవౌ
     దుడు మర్త్యుండవు గావు నిన్గొలుచు టెంతో మాకు శ్రేయంబగున్. 122
     
మ॥ తెలియున్ దేశము నాదు స్వామిపద భక్తిస్థైర్యలీలల్ చతు
     ర్జలరాశి ప్రమితావనీతల మహాసామ్రాజ్య మర్పింప దా
     పలికాలన్ దగులంగ నొల్లను భవత్పాదాబ్జముల్ భక్తిమైఁ
     దలపైనన్ ధరియించి నామనుగడ ధన్యంబు గావించెదన్. 123
     
గీ॥ నాదు భటులు దుర్గములు ధనంబు రాజ్య
     రమయు నర్పింతు మఱియు నా ప్రాణమిత్తుఁ
     దండ్రి నీదు స్వాతంత్య్ర రధంబు మోయఁ
     గుడిబుజం బప్పగించుట గొప్పయగునె 124

మ॥ తమ గర్జారవధాటి నెల్లెడల గోత్రక్ష్మాధరశ్రేణి ఖం
    డములై త్రెళ్ళఁగఁజేయు దోర్బలులు చోండావ న్మహావీర సిం
    హములన్ దోడ్కొనివచ్చి నిల్పెద విపక్షారణ్యముల్' గాల్చి భ
    స్మము గావింత్రు సమగ్ర విక్రమకళా సంరంభ పారీణతన్. 125
    
మ॥ పదివేలేన్గులయంత ధార్ఢ్యమున మద్భావంబు నీపాదముల్
    గదియున్ నిక్కము దేవదానవులు లాగన్ జూచినన్ సుంతయున్