పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


మ॥ అరుదెంన్ బహుదూరుసాహి బహు నైన్యాకముఁన్ గొంచుఁ జి
    త్తురుపైనన్ బ్రళయాగ్నిబోలె నతఁ డుద్ద్యోతించి దుర్గంబు రూ
    పఱ వహ్న్యస్త్రములన్ నిగుడ్చుచు స్వరూప ధ్వంసమున్ జేసె వీ
    రరసాంభోనిధు లెందఱో మడిసి రౌరా: నాఁటి యుద్ధంబునన్. 101
    
గీ॥ ఆ లలాటాక్షు మూర్తులోయనఁదగు హర
   కులజు లైదువందలమంది కొలుచుచుండ
   దుర్జయుఁడు మాపితామహితోడఁ బుట్టు
   రణము సాగించి యర్జునరావు మడిసె. 102
   
సీ॥ నాడు ముత్తాత చండనృపాలు సంతతి
            వాఁడు దుర్గారావు ప్రళయభైర
    వారావుఁడై వైరు లడలిపాఱఁగఁ దోరి
            పడియెఁ జోండావదన్వయులఁ గూడి
    యాపైన వచ్చి మాయవ్వ జవాహిరి
            బాయి గాయంబులు వేయుఁగాఁగ
     మహిషాసురేశ్వర మర్దవలే రేఁగి
            విమతుల నోర్చి ప్రాణములు విడిచెఁ
            
ఆ॥ బదియుమూఁడు వేలుపడఁతులు 'గొలువఁ గ
    ర్ణావతియును నాదునాయ నమ్మ
    రోహితాశ్వుశిఖల జోహారు గావించె
    నిట్టి వీరమూర్తులెందుఁ గలరు. 103
    
సీ॥ కడకు మూఁడవమాఱుగా నక్బ రేతెంచె
           నంతము లేని సైన్యములఁ గొనుచు
    వీరులందఱు గూడి విశ్వపూజ్యంబైన
           చిత్తూరుకోట రక్షింపవచ్చి
    రల పరంగుల పిరంగుల మ్రోల దుర్గంబు
           గాజువిధాన ప్రక్కలయి కూలె
    మేవాడ వీర లక్ష్మీవజ్రమకుటముల్
           జయమల్ల ముఖ వీరసమితి మ్రగ్గెఁ