పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

107


గీ॥ గనుదెఱచి కావురని కూయఁగాఁ దెలియని
   శిశువు లాదిగ జగదేక జేతృశౌర్య
   పరులవఱ కందరను బట్టి నరకె నక్స'
   రెటులు చిత్తూరు రమ తల యెత్తిబ్రదుకు! 104

   
గీ॥ ఆచతుశ్శాల లాభవ నాంగనమ్ము
   లాజయ స్తంభతతులు దేవాలయమ్ము
   లూఁచముట్టుగఁ జెడియెఁ జిత్తూరు పురము
   కాడుగా మాఱి పాండవ బీడుదేలె. 105
 
   
సీ॥ తలపైనఁ గొమ్మున్న ధైర్యమేరువులు ఝా
          లావనీంద్రుల సేవ లడఁగిపోయె
    నహిరాజు కోఱల నైనఁ బట్టి పెకల్చు
          చోహణ బలములు చొప్పుదప్పెఁ
    బాతాళ మఱచేతఁ బగిలించు ప్రమర లే
          వలన స్రుక్కిరొ సుంత తెలియరాదు
    గగనధాత్రుల నేకముగఁజేయఁడాలిన
           రారోడ్కు లంబు పే ర్మఱువనయ్యె
           
గీ॥ నల చతుర్దశ లోకముల్ గలిసెనేని
   సమయఁజేయు చోండావతుల్ సన్నగిలిరి
   నలుగు రెదిరించినను దానికి నిలువరించు
   పోఁడిమికిఁ దప్పి మేవాడ వాడు దేలె.106
 
   

ఉ॥ వైరులు మాసమాసమును బైరులఁ గోనెడు నట్లు వీరులన్
    నూఱులు వేలు గోయఁగ, మనోజ్ఞ సువర్ణ శలాక లట్టు లం
    గారశిఖాచయంబులను గాలుచు వేలకు నేలు స్త్రీలు జో
    హారులు చేయ, దేశ మకటా జనశూన్యము గాక. నిల్చునే!107
 
    
సీ॥ తనదు కండలును రక్తము కుమ్మరించి మే
           వాణ్మాత వీరసౌభాగ్యలక్ష్మి
    యొకవేయి యేండ్లుగానోర్చె నోర్చుచునుండె
           శాత్రవతతిపోటు సడల దయ్యెఁ