పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

105


    వసుధ యీనినయట్టు బహుసంఖ్య గలుగు యా
             వనవీరభటకోటి బయలుదేఱి
    పలు శతాబ్దములుగాఁబరతెంచి పైఁబడి
             భరతఖండంబు డీల్పడఁగఁజేసె
             
గీ॥ నందనోద్యానమట్టు లుండంగఁ దగిన
   భూమి పారతంత్య్రమహాబ్దిమునిఁగి కఱవు
   వ్యాధు లీతిబాధలు గల్గి బలము తఱిగె
   మన భరతఖండ పాపమేమని వచింతు. 97
   
సీ॥ కోటిసూర్య ప్రధాంకుండు పృధ్వీసార్వ
            భౌముఁ డియవనులబారి మడిసె
    సర్వజ్ఞతుల్యుఁ డానమరసింహ నృపుండు
            తురకలతోఁ బోరితొఱఁగెఁ దనువు
    సమవర్తిమూర్తి దుర్దమశౌర్యుఁడౌ హమీ
            రాయు వున్నంత కాహవ మొనర్చె
    గుంభుండు రాజ దిక్కుంభి తదర్థమై
            తనజీవితము నెల్ల ధారవోసె
            
గీ॥ నింక సంగ్రామసింహ భూమీశ్వరాదు
   లప్రతీప ప్రతాపులు యవనసేన
   నాపి మెండొడ్డి దేహంబు ప్రాణములును
   గోరువెట్టి స్వాతంత్య్రంబు గొలిచి రపుడు. 98
   
మ॥ ఒకనాఁడా యొకమాసమా మఱియుఁ దానొక్కద్దామా వేయి మేం
    డ్లకుఁ బై నయ్యె మహమ్మదీయసుభటుల్ లక్షోపలక్షల్ లయాం
    తకులై పైఁబడసాఁగి యెంత జనబృందంబున్న మేవాడ మా
    తకునైనన్ దలమున్కలై బ్రదుక సాధ్యంబంచుఁ దోఁపించదే. 99

శా॥ ఒడ్డారించుచు సైన్యముల్ గొని యలాయుద్దీను చిత్తూరు పై
    నొడ్డెన్ ముట్టడి వానిధాటికి జగంబూటాఁడె వాఁడెంతఁగాఁ
    జెడ్డల్ చేసెనో దేవుఁడే యెఱుఁగు నిస్సీ: ధర్మమో సత్యమో
    యడ్డంబుండునె నాస్తికాధముల దుర్వ్యాపారముల్ మాన్పఁగన్. 100