పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


     గసమాధిస్థితినున్న భూపమణియున్ గన్నెత్తి వీక్షించి చెం
     త సమాసీనులు గండటంచుఁ గనుసన్నన్ జేసి యత్యాదృతిన్. 93
     
-: ప్రతాపసింహుఁ డనుచరులతోఁ గర్తవ్యము నాలోచించుట. :-

సీ॥ "తనదేశలక్ష్మి సంతత భోగభాగ్యవై
             భవములఁ దులదూఁగ వలయుననుచుఁ
     దనప్రజ లీతిబాధలులేక బహువిధై
             శ్వర్యంబులు వహింప వలయుననుచుఁ
     దనయిల్లు పూర్వాగత ప్రతిష్ఠాధరం
             బుల వృద్ధినొందంగ వలయుననుచుఁ
     దననేరు పరుల నిందల కాస్పదం బీక
             స్వచ్ఛమై యెపుడుండవలయుననుచు
             
గీ॥ వసుధపై జన్మ మెత్తిన ప్రతిమనుజుఁడు
   జీవితమునిండ యత్నంబు చేయుటొప్పుఁ
   గాని మనదేశ మందభాగ్యమునఁజేసి
   యదియుఁ దలపోయ దుర్ఘటంబై రహించె. 94
   
మ॥ కనుఁ డా మధ్యధరాసముద్రము మొదల్ కాబూలు పర్యంత మొ
    ప్పిన విస్తారసమస్తదేశముల వ్యాప్తిన్చన్న తౌరుష్క భూ
    పనికాయంబులు పూర్వ మేడవశతాబ్దండాదిగా భారతా
    వని కేతేరెఁదొడంగె నాహవకళా ప్రత్యర్ధి దుర్వారమై. 95
    
క॥ ఏఁటేఁట వారు లక్షలుఁ
    గోటులుఁగా నైన్యములను గొని వచ్చు మహా
    ధాటికి భారతదేశము
    బీటలువారిన విధంబుఱ పొసఁగూర్చున్. 96
    
సీ॥ ఆఖొరాసా నిప్పహా నాఫ్గనిస్థాన
             మా బెలూచిస్థానమా యిరాను
    టర్కీ యిరాకు బాగ్దాడు మెసపొటోమి
             యా శిరియా సీమలందునుండి