పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

103

—: ప్రతాపసింహుఁడు సూక్తసింహుని దేశభ్రష్టుని గావించుట.:-

మ॥ "హరభట్టారకమూర్తి పుణ్యతముఁ డయ్యాచార్యుఁ డిట్లౌటకున్
     నెరియున్ నామది కాన నేఁడు రణమున్ నేఁగోరఁ భీతిల్లి నే
     నరుగన్ మానితినంచు నెంచకుము; నీయౌద్ధత్య బాహాబల
     స్ఫురణన్ వమ్మొనరింపకుండినను నేసూక్తుండనే కాదుపో. 87
     
చ॥ ఇరువుర నెవ్వరో యొకరుఁడీజగతిన్ విడు నంపకున్ బర
     స్పర ముఖదర్శనంబు కొనసాఁగక యుండెడుఁగాత ఘోరసం
     గరములఁదప్ప బ్రాణమునుగాచి మెలంగు మటంచుఁ బల్కి తా
     నరిగెను ఢిల్లిత్రోవకుఁ గులాంతకు లందఱు పోవు తావుకున్ 88
     
మ॥ “సమయన్ జేసి కృతాఘపుంజములఁ బశ్చాత్తాపదీప్తాగ్ని శు
     ద్ధమతిన్ వచ్చినఁ జోటులేదనదు వాత్సల్యాంబువారాశి కో
     పము జన్మింపని దొడ్డతల్లి మనమేవాణ్మాత దాక్షిణ్య హ
     స్తము పైఁగప్పు శతాపరాధికయినన్ సద్భక్తిఁ బ్రార్ధించినన్.” 89
     
మ॥ అని తా నింటికి వెళ్ళి యయ్యుదయసింహస్వామికిన్ బోలె న
     య్యనఘాచార్యున కంత్యసత్క్రియలు చేయన్ బంచి యాత్మోప శాం
     తిని బెంపన్ జప హోమదానములు సంధింపన్ మొదల్పెట్టి య
     జ్జననాథాగ్రణి యిచ్చెఁ దత్సుతునకున్ సారాగ్రహారంబులున్ 90
     
గీ॥ హరగురుం డనంతత్యాగ మాచరించి
     నట్టియెడ నొక్క సత్రంబు గట్టఁ బనిచె
     శాశ్వతాన్న దానంబును జరుపఁదలఁచి
     దుర్మరణదోష మతనికి దొరయకుండ. 91
     
క॥ ఆమఱునాడు కిరాత
    గ్రామణి సామంత నృపులుగ్వాలియరు మహా
    భూమీశ్వరుఁడు ప్రతాప
    స్వామికడకు వచ్చి రతని సందర్శింపన్. 92
    
మ॥ పసఁజెన్నారు చిరత్నరత్నతతి శోభల్ గుల్కు క్రొమ్మేడ పై
    నసమానంబగు వ్యాఘ్రచర్మమున నధ్యాసీనుఁడై రాజయో