పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

"ఆ మహానాయక వతంసమా ప్రతాపుఁ
డెన్ని గతుల యోజించిన నన్నుఁబోలు
కోటి సార్వభౌములు చేరి కొలువఁ దగిన
క్షాత్రనిధి యనుమాట వజ్రాల మూట"
"నాదు జీవితశేష మంతయుఁ ప్రతాపు
సేవ కడిపినఁగాని దుష్కీర్తి పోదు.”
"మన బ్రతుకులు పోరులనె తెల్లవారిన వకటా,"

ఇది అక్బరుయొక్క సౌశీల్యము.....

ఈకవి యఖండమైన క్రొత్త పలుకుబడులు గలవాడు.

"ఇతడు బాడబానలము పారమ్రింగు మహా బలుండు”
"పిడుగుల్ వ్రేళ్ళ నఱకు భయద శౌర్యులు*
"మొదలన్ నెత్తురు పంచుకొంచనుజుఁడై పుట్టొందె”
"ఒకకాడన్ జనియించు రెండుపువు లట్లొప్పారి”
"దురదృష్టం బది యెల్ల నాపయిని గంతుల్ పెట్టె"
"అక్బరు విజయరధము కాడిమోసిరి స్వాతంత్య్ర ఘనతమఱచి"
"పుడిసెం డూపిరి మేన నుండు వఱకున్ బోరాడి"
"మూటలను గట్టి యాయువు బుఱ్ఱకెత్తి
"శాశ్వత బ్రహ్మకల్ప మీజగతి నుందుమో. ”

ఈ మొదలైన వనేకములు-ఇంక సందర్భానుసారముగ లోకోక్తులు మొదలైనవి కుప్ప తెప్పలుగానుండి గ్రంధము ఆంధ్రసరస్వతీదేవికి క్రొత్త భూషణముగా నున్నది.

ఈకవి రాజపుత్రయోధుల శౌర్యాదుల నెంత వర్ణించునో ముసల్మానుల శౌర్యాదుల సంతే వర్ణించును. హుమయూనుని వర్ణించుటయు, బేబరుపడ్డ కష్టములు వ్రాయుటయు నొక ముసల్మాన్ కవి యెంత యభిమానముతో వ్రాయునో యీయనయు నట్లే వ్రాసెను. ఈ రచన భారతము ను దలపించుచున్నది. ఉదయసింహునకు 25 మంది కొడుకులు - రెండప వాఁడు సూక్తుడు - మూడవవాఁడు సాగరుఁడు - పెద్దవాడు ప్రతాప