పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

వలెనని యుద్ధము చేయలేదు. పౌరుషశక్తితో గెలువలేనని యాయనకు దెలియును. కాని వట్టి ధర్మము కోసము యుద్ధము చేసెను. భారత జాతీయ ధర్మము పరులకు లొంగిపోదు——చచ్చిపోదు అని రుజువు చేయుటకే యుద్ధము చేసెను.

"కాన విజయంబు ముఖ్యంబు గాదు మనకు, ధర్మ నిర్వహణంబు కర్తవ్య మిపుడు."

ఇది ప్రతాపుని యూహ. ఈఘట్టము చదువవలెను. నేఁటి సత్యాగ్రహ మునకు ఆనాఁటి ప్రతాపుని యుద్ధధర్మమునకు భేదమే లేదు.

ప్రతాపీయులు_అన్నము తినలేదు.-- నీరుత్రావలేదు నిదురపోలేదు. ఇది బలవంతము చేతగాదు వ్రతముచేత.

ఈ కధకు మన కథకు వేయి పోలికలు. అన్నిటికన్న గొప్ప పోలిక అబ్దూరహిమాన్ - ఈయన అగ్బరు చక్రవర్తి సర్వ సేనాని- వీర రసా రాధకుఁడు- ప్రతాపునకు పృధ్వీసింహుఁడు వ్రాసిన యుత్తరము కవియైన యీ ముసల్మాను సేనాని వ్రాసిపెట్టినది. ఆయన యెంత వీరుఁడో యంత కవి. రవిధ్వజము - గరుడధ్వజముగా, కృపాణము - నందకముగా, కవచము పట్టుబట్టగా, హాల్దీఘాటు యుద్ధమున తనకు “ప్రతాప రాజనారాయణుఁదు దర్శన మొసంగెనట. అతఁ డగ్బరుతో ననుచున్నాఁడు. ఆ ప్రతాపుఁడు.....

మ॥ "అకటా నీవలె ధర్మముల్ దెలిసి రాజ్యం బేలఁగాలేఁదొ మ
     చ్ఛికమై భూప్రజఁ బుత్రులన్ బలెఁ గృపాశ్రీఁ జూడఁగాలేఁడొ, పా
     యక వర్ణాశ్రమ ధర్మపద్ధతి తీరంబై నిల్పఁగా లేఁడొ, యెం
     దుకు నాతండు స్వతంత్రుఁడై నిలువఁ గాదో యానతీఁ గోరెద౯.”

ఈరహిమానుఁడు మఱియు ననెను ఆ ప్రతాపునకు తాము సమకాలికు లగుటయే గొప్పతనమట. ఇట్టి రహిమానులు నేఁటి పాశ్చాత్యులలో నెంతమంది లేరు ఆ పాశ్చాత్యులలో నక్బరు చక్రవర్తులే లేరు అక్బరు చక్రవర్తి ప్రతాపుని గురించి యిట్లనెను._