పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

49


సీ. ప్రళవభైరవ హస్త పటహపటపటధ్వ
           నులు బలుపెట్లు గ్రోవుల తతులును
    మహి డిగ్గి సేవించి మరలు నింద్రునిఁ గొల్వు
           పంజులౌ నక్షత్రబాణములును
    పనిబూని చక్రంబు బహురూపలాస్యవి
           భ్రమమందె ననఁ జక్ర బాణములును
    పరిచరణాయాత తరణి చంద్రప్రభ
           లన తదీయజ్యోతుల గణములను

గీ. రోదసీ సరసీజలపాదపద్మ
    కుముద రూపము లాకుంచ కోలగముల
    చెలఁగు బిరుసులు పగలు వత్తులుగ నమర
    బరఁగు బహుచిత్ర బాణవైభవము గనుచు. 77

జాతివార్తావచనము

వ. వేంచేయు నవసరంబున గురు మహాప్రధాన మాండలిక సామంత సేనాపతి ద్వారపాల కావసంక ఘటికా నిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యోతిషక కావ్యజ్ఞ విద్వద్దేవార్చక మాల్యాకార పరిమళాకార గోష్ఠాధికార, గజాధికారాశ్వాధికార వస్త్రాధికార భాండాధికార ధాన్యాది కార్యంగరక్షక సూతసూద చాణూర బేతాళ మల్లతాంబూలిక తాళవృంతిక నరవాహక చాత్రిక చామరిక కాళాచిక కరదీపికాధారక కఠారిక కారవాలిక పాదుకాధారక నర్తక గాయక వైణిక శాకునిక మాగధ వైతాళిక స్తుతిపాఠక పరిహాసక క్షౌరక రజక సౌచిక చర్మకార ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవైద్యాశ్వవైద్య పశువైద్య భేరీ వాదక మురజవాదక కారక స్వర్ణకారక శిలాచ్ఛేదక కాంస్యకారక కుంభకారక చిత్రకార వ్యావహారిక జాలిక మృగయార్థి పక్షిపోషకులును, ఫణిహారులు రాయబారులు నుగ్రాణంపు తెగలు కెవనిబంటులు వేశ్యాజనంబు లనియెడు డెబ్బదిరెండు వినియోగంబుల వారలు నలుచెఱఁగుల గొలిచిరా, బహువిధచిత్రబాణ యంత్ర ప్రావీణ్యాలోకన కనత్కౌతుకాయత్తచిత్తులై తొలంగంద్రోయరాని సందడి దలంగి చన నియమించు కాచనం