పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ప్రబంధరాజవేంకటేశ్వర


వ. ఆ సమయంబున-- 73

సీ. జీవరత్నప్రభ జెలఁగు దివ్యవిమాన
             పంక్తినాఁ దేరు దీపములు వెలుఁగ
    ఘన పద్మరాగ మకరతోరణములు నాఁ
             దిరుదండె దీపముల్ దేజరిల్ల
    నిజవాహఫణి ఫణా నిర్యన్మణి ద్యుతు
             లనఁగ నిచ్చెనపంజు లతిశయిల్ల
    నీరార్పితమణి నీరాజనములు నా
             నేనికపంజు లెన్నేనిఁ జెలఁగఁ

గీ. బ్రతిమగమి చేతి దీపికల్ బరిఢవిల్లఁ
    గొలువుదివిటీల కోటానుకోటు లమరి
    వరుస గన్పట్ట నుభయపార్శ్వముల భక్త
    దత్త సామ్రాణి ధూపముల్ దనరెనపుడు. 74

సర్వలఘు రూపసమసీసము



సీ. నిఖిల సురదనుజ నికరమధిత జల
             నిధిభవ ఘుమఘుమ నినద మనఁగ
    నభినవ ఘనసమయ సముదయ దశ ని
             లసదమిత పెళపెళ రవ మనఁగ
    సహరహగమనట దభవకర ధృత ప
             రఢమరు ఢమ ఢమ రణిత మనఁగ
    ఖల కనకకసిపుదళన విహరణ నృ
             హరి భయద కహకహ రుత మనఁగ

గీ. దతతుహిన మహిధదర తటపదతులిత
    గగన సరిదిదుత బహుళ ఘళఘళ మహి
    మ యనఁగ దివిభువి నెనయు రయము మెఱయ
    రహి వెనుకొని నిజపటహరభటి నిగుడ. 75

శబ్దస్ఫురణము - అపూర్వప్రయోగము



ఉ. వేంకటశైలభర్త తిరువీథులరా వినిచెన్ దృఢంబుగాఁ
    బంకజసంభవాండ ఘటపంక్తి హటద్దళ నోగ్రబాణ యం
    త్రాంక ఫెడీల్ ఖణీల్ ఫెళఫెళాదిఢమిండమి డబ్బుడబ్బు ఢా
    ఢంకరణ ప్రచండిమ విడంబిక డంభ విజృంభితార్భటుల్. 76