Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

ప్రబంధరాజవేంకటేశ్వర

భాసరుకేసరంబులు రాజితాక్షతలును, అసమానసార లసమాన పరాగ పవమాన డింభములు చెలువలరు చలువతెరలను, శారికావార సుకర కలకలరవంబులు క్రొత్తముత్తైదువ పాటలును, ఫలాపేక్షాయాత నూతన రాజకీరావళులు నిచ్చలపుఁ బచ్చతోరణంబులును, కేకికేకా రావంబులు వందిమాగధబృంద మంగళాష్ట కంబులును, కోకనద సముదయంబులు మెట్టుఁబుట్టికలును, కింశుకముకుళంబులు సురుచిరదీపంబులును, పికకులకలకుహూకారంబు లవార్యతూర్యరావంబులును, కిసలయవితానంబు వితానకపుఁ దానకంబును, కుందకళికా సందోహంబు మీసరపుసేస ముత్తెంబులును, జనులు ప్రియంపడి చూతమను జూతంబు నవకపుఁ బెండ్లి చవికయును, తత్సుమవిసర రసలుబ్దంబులై చుట్టుసోలి వ్రాలిన మదాళినీశ్రేణి నల్లపూసల చాలును, తన్మధ్యభాగలంబమానఫలగుచ్ఛంబు తాళియుంగా వనేందిరా మాధవు కల్యాణమందిరంబు తెఱంగునం దఱంగలించు, మఱియును—

ద్వంద్వప్రాసకందము

క. వనము నిఖిలజన సంజీ
   వనము సకృద్దర్శనాభివర్ధిత పుణ్యా
   వనము నిరంతరమునిసే
   వన ముపగతజీవనము సువనపావనమై. 41

వ. వెలయు దత్ప్రదేశంబున. 42

ప్రకృతాప్రకృతశ్లేషయుక్త సాగరోపమానవన వర్ణనసీసము



సీ. అశ్రాంత సౌమనస్సామోదకృద్రస
             సారముద్భవరస కారణంబు
   తారప్రవాళశితద్రుప్రవాహస
            ద్గ్రాహభ్రమోత్కాళికాకరంబు
   గోధికాహరిశంఖ కోలపోతస్థల
            రాజీవరాజీవరాజితంబు
   బ్రహ్మకళాగూఢ బాడబరాగప్ర
            కాండవిఘోషరంగత్తటంబు