పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

35

నిరుకప్పుకప్పుట కొప్పులగు గొప్పకొప్పులు, పున్నమవెన్నెల చిన్నెల మిన్నల మిన్నెల్లఁ జెన్నలర న్నెలకొన్న క్రొన్నెల నెలయించ నెదురు నెన్నుదురులు, రేరాఱాల తెలిడాలు నగఁజాలు వాలుగన్నుల జిగిగల వాలుగన్నులు, పొంకంబగు జింకల జంకించు బింకముఁజూపు చూపులు, శంపాలతికల సొంపునింపు సంపంగిసంపద గుంపులఁ బెంపుపెంపున స్ఫుటమ్ములయిన నాసాపుటమ్ములు, శ్రీవర్ణసవర్ణంబులగు కర్ణంబులు, నిద్దపుటద్దపుటుద్దుల తళుకులఁ జెక్కుఁజెక్కులు, నిగరాలమగఱాల నిగరాల గను నితాంతకాంతదంతంబులు, పగడంబుల జగడంబులపై జగడంబులు సేయ విడంబించు విడంబించు పదవుల పదవులగు పెదవులు, వలమురి మురువుల చలమరితనంబున జయించ నగ్గలంబుగల గళంబులు, చొక్కపుఁ జక్కదనంబుల జక్కవకవఁ గవకవ నవ్వు నిబ్బరపు సిబ్బెపుటుబ్బు గబ్బిగుబ్బలు బిసమ్ముల వసమ్ముగాని వెక్కసమ్ములాడ నారజమ్మగు భుజమ్ములు, ఆకసంబుఁ గేకసల్కొట్టి కాకుసేయుట కౌనను కౌనులు, అవక్రచక్రంబు నాక్రమించిన ఘనజఘనంబులు, రంభాస్తంభసంరంభంబు వెడలం గడలకు గడలుకొలుపు దొడలు, నాణెంబులగు తూణంబుల జాణతనంబులాడి ధిక్కరించు నిక్కులకిక్కులౌ పిక్కలరు పిక్కలు, సరససారసవిసరంబుల పసదనంబుల నిరసించు టొసపరి మిసమిసలు దెసల నెసఁగ నాస్పదంబులగు పదంబులు గలిగి వాలుగంట్ల పడగ కొమ రమరు మరువెలిదమ్మి వాలుగంట్లకైపు సొలపు మెలపుల నలపుగొలుపు వాలుగంట్ల కింపులునింపు నవ్వనంబు సురపతి యాస్థానంబు కైవడి సుమనోవిరాజితంబై, రాజానుగ్రహంబు లీల నపరిమిత ఫలానుకూలంబై, అనుకూలాంగనారత్నంబు విధంబున ననవరతోత్సవకరంబై, పారావారంబుమేర వాహినీసమాగమస్థలంబై, మార్తాండునిరీతిఁ గమలానందకరంబై, కంఠీరవంబుచాడ్పునఁ గందరమావిలసితంబై, భారతంబు చందంబున భీమార్జున నకులసహదేవ శోభితంబై, వినాయకుని పగిది సువర్ణపత్రమంజుళంబై, మహానటుని జటాజూటంబువైఖరి యహీన భోగాస్పదంబై, నిగమనికరంబుఠేవ నిరవద్యజటాధారంబై, కుకవి ప్రబంధంబుమర్యాద జాతి వార్తాశూన్యంబై, దూతికల తెఱంగునఁ బల్లవరాగం బొనగూర్చుచు, సాదిపోలిక తావుల మావుల బ్రోదిసేయుచు, సౌరభావరణంబున కళికామితోత్కర్షఫలంబున కరంబుసొంపు సంపాదింపుచు,