పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 ప్రబంధరాజ వెంకటేశ్వర

మొక్కు వరాలందిడును వరాలు క | పురతాంబూలము వేంకటశైలము
గ్రక్కున తనుబొగ డర్థుల కొసఁగును | కనకదుకూలము వేంకటశైలము
తవులఁగఁ గనరేయి పగళ్ళు దివిజ | దనుజులయాలము వేంకటశైలము
అవిరలమృగయోత్సవధావచ్ఛా | గాదిసృగాలము వేంకటశైలము
సూటిగఁ బొగడని ఖలుల న్మీలకు | జొక్కపుగాలము వేంకటశైలము
ఏటను బ్రహ్మోత్సవమున సుజనుల | కిచ్చువిరాళము వేంకటశైలము
ప్రాకటచతురాస్యోక్తనిగమసా | రంపు నిరాళము వేంకటశైలము
ఏకాంగులకును వైష్ణవులకు సిరు | లిడు హేరాళము వేంకటశైలము
నార్ఖాదాధిపు పట్టిన హరియం | దపు వింటాలము వేంకటశైలము
ఆర్ఖేలనవర్ణిత విగ్రహమగు | హరిమణికీలము వేంకటశైలము
ఎసక మెసఁగ దిశ ఘూర్ణిలు వేలుపు | టింతులమేళము వేంకటశైలము
వసుధాధీశాంతః పురకాంతా | వారనిచోళము వేంకటశైలము
లంబుగ నెలకొన పసులకుఁ దాపసు | లకు ననుకూలము వేంకటశైలము
అంబరచుంబి కదంబ కదంబ మ | హాహింతాళము వేంకటశైలము
శోభిత విద్వత్కవి రచితాకృతి | స్తుతిధారాళము వేంకటశైలము
ఆభపదోన్నతి పెరిగానుక యు | న్నది పాతాళము వేంకటశైలము
గజహయ పుష్కల ముష్కరతౌరు | ష్కబలపిఫాళము వేంకటశైలము
భజియింపని జనులకుఁ జూపును ద | ప్పక గోపాలము వేంకటశైలము
కొలిచినవారల కనువారము నొన | గూర్చు సుమాళము వేంకటశైలము
తలఁచినభక్తుల కభిమత శుభమతి | దయనిడు వేళము వేంకటశైలము
ఇరువుగ నుండెడు నరులకుఁ గోర్కుల | నిడు ఫలకాలము వేంకటశైలము
పరిపరిగతులను యతు లాత్మలఁ దలఁ | ప గదగు శీలము వేంకటశైలము
హరినతఫాలము వేంకటశైలము | హరులదువాళము వేంకటశైలము
దొరువులతాళము వేంకటశైలము | దొరలకు మేళము వేంకటశైలము
వేంకటశైలము విబుధావాలము | వేంకటశైలము వినమితనీలము
వేంకటశైలము విగతికరాళము | వేంకటశైలము వెన్నునిపాళెము

అనుప్రాసదళవచనము

వ. అట్టిగట్టునఁ జడలతుదల మొదలఁ బొదలు విరిబొదలరొదల వదఱుచుఁ గదలెడు కొదమతుమ్మెద కదుపుల నెదుగఁ బదిలముగఁ గుదురఁగనిన