పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

37

గీ. నగుచు శంకరవరబాణహారిపవన
   శశధరాభ్యుదయాన్విత శ్యామలాభ్ర
   సహితకమలాదిజన గురుస్థాన మయ్యె
   సంగు రంగుగ వనరాశి సరణి వనము. 43

రూపకాలంకారము



సీ. వనమహీస్థలికొల్మిఘనకింశుక ప్రసూ
            నంబు లంగారవారంబు లచటి
    యళిసమూహంబు నల్లలు మందపవనుండు
            చర్మభస్త్రికమూతిచయము తలిరు
    టాకుజొంపములు తీవ్రానలజ్వాలలు
             వనపక్షిరవము తజ్జనితరవము
    కమలకర్ణికఠాయికడునొప్పు కేతకి
             పసవదళంబులు పట్టుగార్లు

గీ. గాఁగ నామనియను లోహకారకుండు
   మదనునకు జిగురువాలును మంచివిరుల
   శరములును వాడిగాఁజేసి బిరుసుపదను
   పువ్వుదేనియ నించె నాఁ బొల్చు నచట. 44

మధుమాసవర్ణనము


సప్తానుప్రాసచరణసీసము



సీ. ఒకమేర మృదుసౌరభకిశోరకసమీర
            మొకయోరవరకీరపికవిహార
    మొకచోటనాఖేట సకలాట పికకూట
            మొకబాట వనఘోటక కుల ఝాట
    మొకపొంత సులతాంత నికరాంతరప్రాంత
             మొకచెంత ఫలసంతతి కుజకాంత
    మొకలోయ ఖగనాయ కుదాయ సముదాయ
             మొకచాయ సురగాయక కృతగేయ