విజయవిలాసము
25
కఱ్ఱజవ్వాజి చొక్కమటంచుఁ జెవులందుఁ
జేర్చి చెక్కుల గోరఁ జేరఁదీసి
గంబురాయిట్టి దెక్కడ లేదు చూడుమా
యని రవ కనురెప్పలందుఁ జరిమి
గీ. యిట్టిచెయ్వులఁ గూరిమిఁ బుట్టఁజేసి
పల్లవుల చేతిరొక్క మప్పరిమళిములు
వెలల పేరిఁట దోచి యవ్వీటఁ బొల్తు
రలరు సరులమ్ము ప్రాయంపు టలరుఁబోండ్లు. 21
నారికేళపాకము
సీ. సారవత్పౌరవోజ్జ్వల దంఘ్రిశృంగార
నూపురం బలిబిలిగోపురంబు
గణనదుర్లభమణి గణ ఘృణి చుంబిత
గోపురం బలిబిలి గోపురంబు
ఘనమునిజన చిరంతన పుణ్యసరణికి
గాపురం బలిబిలి గోపురంబు
కీర్తిత మోక్ష లక్ష్మీ పక్ష్మ లాక్షికిఁ
గాపురం బలిబిలి గోపురంబు
గీ. కాంతి చిత్ర వర్ణ నితాంత కాంతియుత వ
నీపథ మధులిట్ఛుకపిక నికరకలక
లారవావృత వృషభాచలాగ్రమునకు
మూపురంబైన యలిబిలిగోపురంబు. 22
వృత్త్యనుప్రాసము
తే. హరియు హరియును హరియుఁగా సరియుఁ గరియుఁ
గిరియుఁ గరియును బలునెమ్మిపురియు దరియు
దరియు ఝరియును జమరియు విరియు సురియు
నరియుగంబును దనరియుం డవ్వచరియు. 23