{
విజయవిలాసము
21
గీ. శోభమానకవాటంపుసొంపు మిగిలి
సతతము ఖ్యాతిమహిమచే సంతసిల్లి
వెలయు విటవర్యురీతి నవ్వీటికోట
కదియు కొమ్మల సాంగత్యగరిమ వలన. 4
వ. అట్టివిశాలంబగు సాలంబునకుఁ గ్రొత్తడంబు ఘటించు కొత్తడంబున. 5
ప్రకృతాప్రకృతశ్లేష
సీ. అల నృసింహునియుద్ది నాగ్రహదశనొంది
యుగ్రునివలెఁ జాల నుక్కు మీఱి
నలినసంభవుమాట్కి నలుముఖంబుల నాని
తమ్మియందమున నాళమ్ముఁ గాంచి
సత్ప్రబంధముపోల్కి సారధ్వని నిగుడ్చి
శక్తిభృద్గతిశిఖియుక్తి నొంది
సూకరపతిమేరనేక పద్ధతిఁ బూని
యలరువిల్తునిభంగి నతనుతఁగని
తే. ద్రుమము వహినున్నచోటఁ బాఁదుకొనియుండి
తుఱకకైవడి నల్లమందుపొడి మెక్కి
రాజువిధమున నరిపురిరాజి వేచి
వఱలు నోడక నెపరంగి వగపిరంగి. 6
తే. అన్నమున సున్నమున నృపుల్ బన్నమొంద
నెన్నిమందు లిడుదు రౌర యెన్నిమందు
లట్టి దొక శూరకర్మమె యనుచు నెట్టి
యెల్లమందుల గెలుపొందు నల్లమందు. 7
పంచచామరము
కుఱంగటన్బిరంగిగుండు గుండువారి దారిమే
దురంబునౌ దురంబులో నెదుర్కొనం బెనంగుచోఁ
బరస్ఫురత్తురంగపాళి బాళిఁదాఁకి దాఁకిత
చ్ఛరీరపారవశ్యకృత్ప్రసంగి సంగతిం దగున్. 8