పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

15

  
    రాణింప వసంతతిలక
    భాణముఁ దెనుగించి కీర్తి బడసిన సుకవిన్. 47

క. సుకవులు పొగడఁగ మా
    తృక లన్నియు వరుస నెసఁగనే దొలుదొలుతన్
    జికిలిగఁ గఠినప్రాసశ
    తకరాజము సేసినట్టి ధన్యుఁడఁ బుడమిన్. 48

తే. రహిగఁ బాణిని యాచార్యరచితమైన
    ప్రక్రియాకౌముదిని యాంధ్రరచనచేత
    సీసమాలికఁ జేసి ప్రసిద్ధిఁ గాంచి
    నట్టి యప్పయకవి వేంకటార్యమణిని. 49

క. ఎన్నఁ దెనుఁగునకు రాజను
    గ్రన్ననయతిరాజునకును రమణయకును నే
    జిన్నను ద్విపద నొనర్పను
    జిన్నన్నను బిరుదుగద్యఁ జెప్పిన ఘనుఁడన్. 50

సీ.[1]
  (నవనవముగను జాంబవతీవిలాసమన్
జిత్రకావ్యము విరచింప వశమె)
  చండవిద్యావతీదండకరాజంబు
సులభమే రసము హెచ్చుగనొనర్ప
  లాలితచక్రవాళాకృతిఁ దారాళిఁ
దరమె యన్యులకు వింతను ఘటింప
  నఖిలపురాణసారాంశ మి ట్లలవియే
యిల విలాసంబుగాఁ దెనుఁగుఁ జేయ

  వేంకటేశప్రసాదప్రవృద్ధసుప్ర
  సిద్ధసారస్వతోద్బోధసిద్ధి కతనఁ
  గలిగె నీ భాగ్యమని యెల్లకవులు నన్ను
  నెన్న నే నెన్నుకొను టెన్నఁ జిన్నగాదె. 51

  1. ప్రాసంబు లిర్వదేఁబదియతు ల్లక్షణం । బుగ సీసమాలికఁ బూన్పవశమె' పా. (పూ.రా.)