Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

14

  

[1]కాటేపలీ ముఖ్య గణపవర గ్రామ
                  శేఖర శిష్ట వసిష్ట గోత్ర

గీ. శోభమా నాశ్వలాయన సూత్ర మంత్రి
   వర్య లక్షణకవి వేంకటార్య ఘనుఁడ
   మంగమాంబామణీ గర్బ మహితశుక్తి
   మౌక్తిక ప్రతిమానసమాన తనుఁడ

క. అమితాశువు మధురము చి.
   త్రము విస్తారము చతుర్విధ కవితలను చి
   త్రముగను వింశ త్యవధా
   నముల న్ఘటియించు లక్ష్మణకవివరుండన్.

క. పంకజ భవ భార్యాకర
   కంకణ ఝణ ఝణ నినాద కవితాపటిమన్
   బొంకంబగు లక్ష్మణకవి
   వేంకటపతి మంత్రి యనఁగ వెలసినవాఁడన్.

క. మును శ్రీహర్షుడు సంస్కృత
   మునఁ జేయు ద్విరూపకోశమునకు దినుసుగాఁ
   దెనుఁగున ద్విరూపకోశము
   ఘను లెన్నఁగఁ జేసినట్టి కవిచంద్రుండన్.

క. జగతి న్వృత్త చతుష్టయ
   మగణితముగఁ జిత్రకవిత లై దిర్వదిలోఁ
   దగ మెప్పుగనం దగురూ
   ఢిగఁ గల్పిత కల్పలత ఘటించిన ప్రౌఢన్.

క. వాణీలీణానిక్వణ
   పాణింధమ పదనిబంధ బంధుర ఫణతుల్

  1. కామేఫలీ - అని కొన్ని ప్రతులలోఁ జూపట్టు. ఈ విషయమును బీఠిక లో జూడనగు (పూ. రా.).