పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

8

     నిరువదియేఁటను శృంగారమంజరి
                   యు నుదాహరణఁజేసి ఘనతఁగన్న
     నిరువదేనవయేఁటఁ గృష్ణమల్లకథ చ
                   తుర్భద్ర జెప్పి సంతుష్టిఁగన్న
     మఱియును బాలరామాయణ ద్విపద పొ
                   సంగించి బహువిధచాటుకవిత

గీ. నతిశయముఁగన్న నాదుజిహ్వాంచలంబు
     తనివినొందదు కులదేవతావతంస
     వేంకటేశ్వర చరణారవింద మహిమ
     నవనవోన్మేషలేశవర్ణనలఁగాక 26

వ. అని తలంపుచు నొక్కనాఁడు కర్ణాటతుండీర చోళపాండ్యదేశాదీశ ముఖనిఖిలధరణీవర మణిదత్త మత్తేభ ఖత్తలాణిక పల్యంకి కాందోళికాదిచిరత్న రత్నఖచిత రుచిరాభరణ గణప్రకాశిత విభవుండును, సద్గుణ ప్రభవుఁడును; కార్యఖడ్గపటిమధురీణుండును, చతుష్టష్టి విద్యాప్రవీ ణుండును; సనక్షత్రాత్రినేత్రోద్భవోపమానాచ్చ ముక్తాగుళుచ్ఛచ్చవి సంకీర్ణకర్ణభూషావిశేషవదనుండును, దిగంతాయాత విద్వత్కవి వ్రాతబంధుజనావన సదనుండును; నిరంతరాభ్యాగత భూసురాన్న దాన నిష్ఠాతురుండును ధర్మరహస్య పరిశీలన కళావిఖ్యాతుండును; దైనందినాజ్ఞాన ప్రాపితపాపహరణ చుంచు చంచ దష్టాక్షరమంత్ర పఠనాసారుండును ప్రభుసందేశ సకల లోకోపకార కృత్ప్రచారుండును, సత్యవాక్య ప్రతిష్ఠాగరిష్ఠుండును, సదాచారనిష్ఠుండును; అసాధారణ మేధాఘటిత మంత్ర తంత్ర సంధానాబంధన గంధవాహ బాంధవ నిర్గంధిత గంధాంధదండనాధ యూధ స్కందాపార పారావారుండును, శారదా శారద నారదా నారద పారదా పారద శార సౌరాహారాచల నీహార మందార వనీసార వనివంచిత సమంచిత శాశ్వత విశ్వజనీనకీర్తివిహారుండును, పరస్త్రీ పరధన పరాఙ్ముఖశీలుండును, దీనదయాళుండును, కాశీసేతు మధ్యస్థలప్రసిద్ద నిజచరిత్రుండును, కృతసుధీజనస్తోత్రుండనగు నేను నిత్యకృత్యంబులఁ దీర్చి, నిశాసమయంబునఁ గర్తు మకర్తు మన్యధాకర్తు మతి