పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

9

సమర్థ హరికృపాపాణింధమాపాంగలబ్ధ బహువిధ భోజనమూల్య జాంబూనదాంబర సార గంధసారరుచిర విచికిల ఘనసార తాంబూల ప్రియకామినీ సంగీతగోష్ఠి సుమశయ్యాష్టభోగాభోగ సంగతుండనై హంసతూలికా తల్పంబున వేకువఁదేఁకువగల సుఖసుప్తినున్న సమయంబున-

 
సీ. చక్రిదంష్ట్రాదృత సర్వంసహా చక్రి
                   చక్రివిదారణాశ్వంబువాఁడు
     దాని రమావధూమాన ధనాదాని
                   దానిరాడ్వరద సద్గరిమవాఁడు
     మాలితనుద్యుత మర్ధితఘనమాలి
                   మాలిన్యవిరహిత మహిమవాఁడు
     హరినీలాహ్వయధారుణీధ్రవిహారి
                   హారిద్రరుచి నిచయంబువాఁడు

గీ. పాలమున్నీటిదొలఁకులఁ దేలువాఁడు
     లీఁల బొలదిండి మూఁకలఁ ద్రోలువాఁడు
     వేలుపులచాలునేవేళ నేలువాఁడు
     బాలవేంకటశౌరి నామ్రోలనిలిచె. 28

తే.గీ. నిలచి జలధర గంభీర నిస్వనమునఁ
      బలికె నాతోడ వీనుల పండువుగను
      మాకు నంకిత మొనరింపుమా కుమార
      యీ విలాసంబునకు సాటి యెందులేదు.29

శబ్దచిత్రసీసము



సీ. సుకవిరాజులుగాని సుకవిరాజులుగారు
                       పోలికనయభూరి భూరిగరిమ
      గురుచంద్రములుగాని గురుచంద్రములుగారు
                       తరముబుద్ధినిదాన దానపటిమ
      సద్బుధేంద్రులుగాని సద్బుధేంద్రులుగారు
                       ప్రతియుక్తి సౌభాగ్య భాగ్యమహిమ