పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోణిగి, కృశశౌచమందలి పాపహరునకుఁ దెలియుట, శ్వేతగిరియందలి సింహలోచనునకు వెన్నెల, ధర్మపురియందలి యోగానందునకుఁ గొల్వు మ్రొక్కు, శ్రీకాకుళమందలి తెలుఁగురాయనికి దండము, అహోబిలగరుడాద్రియందలి హిరణ్యాసురమర్దనునకు నమస్కారంబు, పాండురంగమందలి విఠలునకు సాష్టాంగంబు, యాదవపర్వతమందలి నారాయణునకు నమస్కృతి, ఘటికాచలమందలి నృసింహునకు నమోనమో, వారణగిరియందలి వరదునకుఁ బ్రణుతి, కాంచియందలి కమలలోచనునకు వందనంబు, యదోక్తస్థలమందలి యధోక్తకారునకుఁ బ్రణామంబు, పరమస్థలియందలి పరమేశ్వరునకు ముకుళితహస్తంబు, పాండుభూస్థలి పాండవదూతకుఁ బ్రణిపాతంబు, విక్రమస్థలిఁ ద్రివిక్రమునకుఁ బుష్పాంజలి, కామాళియందలి నృసింహునకు సన్నుతి, అష్టభుజస్థలమందలి యష్టభుజున కానతి, ప్రవాళస్థలమందలి ప్రవాళవర్ణునకు వినుతి, దీపాభస్థలమందలి దీపాభున కంజలి, గృధ్రస్థలమందలి విజయరాఘవునకు శిరోనమ్రత, వీక్షారణ్యమందలి శయానవీరరాఘవునకు శరణు, తోతాద్రియందలి తుంగశయానునకు నమోవాకంబు, గజస్థలమందలి గజార్తిఘ్నునకు శరణార్తి, బలిపురమందలి మహాబలునకు ఆరాధనంబు, భక్తసారమందలి మహాజగత్పతికిఁ బూజ, యింద్రస్థలమందలి దేవదేవునకు కైంకర్యంబు, గోపపురమందలి గోపపతికి సపర్య, అంతర్వేదివాసుండగు నారసింహునకు నమస్కారంబు, భద్రాచలమందలి కోదండరామునకు భద్రంబు, శోభనాద్రివాసుఁడగు సుబ్బరాయనికి క్షేమంబు, మంగళగిరి నరహరికి నిత్యసేవనంబు, శ్రీముష్ణమందలి యాదివరాహస్వామికి శుశ్రూష, మహితస్థలమందలి పద్మలోచనునకుఁ బరిచర్య, శ్రీరంగమందలి రంగస్వామికి నమస్య, శ్రీరామస్థలమందలి జానకీప్రియునకు నర్హణంబు, శ్రీనివాసస్థలమందలి పుణ్యమూర్తి కభిస్తుతి, స్వర్ణమందిరమందలి స్వర్ణస్వామికి సంస్తుతి, వ్యాఘ్రపురమందలి మహాబాహునకు స్తవంబు, యాకాశనగరమందలి హరికి స్తోత్రంబు, యుత్పలావతకమందలి శౌరికి వినుతి, మణికూటమందలి మణిప్రభున కభివాదనంబు, విష్ణుపురమందలి మహావిష్ణునకు దాస్యంబు, భక్తస్థానమందలి భక్తిప్రదునకు దిగ్విజయంబు, శ్వేతహ్రదమందలి శాంతమూర్తికి విజయంబు, అగ్నిపురమందలి మురద్విషునకు మంగళంబు, భార్గవస్థానమందలి భర్గునకుఁ గళ్యాణంబు, వైకుంఠమందలి మాధవునకు శుభంబు,