పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజరి
వక్రసన్నక్రసత్పాదనాపాద
కారవాధారవాధారణాకార

ముక్తపదగ్రస్తము
సారహంకార సంసారధామార
మార సంహారసంభావ్యభానవ్య.

నమస్కారశబ్దలక్షితకందద్వయగర్భితవచనము
వ. శ్రీవైకుంఠమందలి వాసుదేవునకు మ్రొక్కు, యామోదస్థలమందలి సంకర్షణునకుఁ జేమొగువు, ప్రమోదస్థలమందలి ప్రద్యమ్నున కేడికోళ్ళు, సమ్మోదమందలి యనిరుద్ధునకు సలయు, సత్యలోకమందలి విష్ణున కేకిసలు, సూర్యమండలమందలి పద్మాక్షునకు జోడీలు, క్షీరాబ్ధిస్థలియందలి శేషశయనునకుఁ జెంగనాలు, శ్వేతదీపమందలి తారకస్వామికి కన్నులమ్రొక్కు, బదరీవనమందలి నారాయణునకు జోతలు, నైమిశారణ్యమందలి హరికి జోహారు, హరిక్షేత్రమందలి సాలగ్రావస్వామికి సురతానిసలాము, అయోధ్యయందలి రఘూద్వహునకు దోయిలి, మధురనున్న బాలకృష్ణునకు సాఁగిలి, మాయాస్థలమందలి మధుసూదనునకుఁ గోళిగి, కాశీక్షేత్రమందలి భోగిశయానునకు నివాళి, యవంతియందలి యవనిపతికి మెలు, ద్వారవతియందలి యాదవేంద్రునకుఁ గొలువు, వ్రజస్థానమందలి గోపీజనప్రియునకు గొబ్బిళ్ళు, బృందావనమందలి నందసూనునకుఁ బొగడ్తలు, కాళీహ్రదమందలి గోవిందునకు గొండీలు, గోవర్ధనమందలి గోపవేషునకుఁ డెంగనాలు, భక్తలోచనమందలి భవఘ్నస్వామికిఁ గౌడీలు, గోమతపర్వతమందలి శౌరికి మోడ్పుఁగేలు, హరిద్వారమందలి జగత్పతికిఁ జేవిప్పు, యాగయందలి మాధవునకు సాంగుబలా, గయయందలి గదాధరునకు మోడ్పు గంగాసాగరసంగమస్థలమందలి విష్ణువునకుఁ గైమాపు, చిత్రకూటమందలి రాఘవునకుఁ గిడిగిళ్ళు, నందిగ్రామమందలి రాక్షసఘ్నునకు జేజే, ప్రభాస్థలివిశ్వరూపున కల్లోనేరడల్లో, శ్రీకూర్మమందలి కూర్మమూర్తి కెరగుట, నీలాచలమందలి పురుషోత్తమునకుఁ జేసాపు, సింహాచలమందలి మహాసింహునకుఁ జిన్నిపువ్వు, తులసీవనమందలి గదాధరునకుఁ