పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/334

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. రాగరాగ సరళమురళ రాగరాగ హృద్వికాస
నాగనాగవాహనేహ నాగనాగతనువిలాస
7. గోపగోపసేవ్య భవ్య గోపగోప సదవభావ
గోపగోపనాపతాప గోపగోపదప్రభావ
8. జాలజాల సాలసాల జాలజాల కవనఖేల
నీలనీల మణ్యగణ్య నీలనీల యుగహిశైల. 872

క. తుద కనుపడని మొగలిపూ
పొదిపాపనిజోడు వేల్పుబుడుత పగరతే
రదిమెదిరిన మూకలడఁచ
మదిగల యునికిఁ దగు ముదురుమాయల మనికిన్. 873

త్రిమూర్త్యాత్మక త్ర్యర్థికందము
క. స్థిరసత్యాసక్యాశయ
నరకచ్ఛేదనధురీణ నగరాజకరా
సరసాదరకమలోదయ
హరిహయతనయాయజాహ్వయాపరమాత్మా. 874

చతుర్దళయమకచూర్ణిక
శ్రీహరే, సకలలోకశరణ్య కారుణ్యసింధో, దీనబంధో, భక్తాగమసందోహవసంతం భవంతం, కృష్ణాధిమానసంరక్షణం సర్వశుభలక్షణం, కృష్ణాతిరామణీయకవిగ్రహం దైత్యనిగ్రహం, కృష్ణానుసారిణం మిత్రవిందామనోహారిణం, కృష్ణావతారమోహితవల్లవీజనం శృంగారభాజనం, గోపజనకనాభీపంకేరుహం గోవర్ధనావహం, గోపకల్లోలమాలికాడోలికాఘనవిహారం నిర్వికారం, గోపసోదరం వేణుగీతిసాదరం, గోపవేషధారిణం కుమతవిదారణం, అబ్జసంకాశవదనం అంభోధిసదనం, అబ్జదళనోత్కంఠం అద్యుషితవైకుంఠం, అబ్జసఖచంద్రనేత్రం హైమనేత్రం, అబ్జప్రముఖదిక్పాలకస్తూయమానవిజయవిలాసం భాసమానదరహాసం, నాలీకబాణజనకం నాసాజితకనకం, నాళీకనిస్తులకౌస్తుభమణిరమణీయక్రోడం పురాతనక్రోడం, నాళీకవచనగోచరం నతఖేచరం, నాళీకదళితసంక్రందననందనం నిఖిలావయవలిప్తహరిచందనం, పుష్కరచరపాపఠ్యమానబిరుదాంకం